ఐదు నదుల్లో బంగారం.. సీఎం సంచలన ప్రకటన!

తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుముట్టాడుతున్న పాకిస్తాన్ దేశానికి ఆ దేశ పంజాబ్ ప్రావిన్స్ సీఎం మరియం నవాజ్ ఓ గుడ్ న్యూస్ చెప్పారు. తమ పంజాబ్‌లోని ఐదు నదుల్లో అక్షరాలా బంగారం ప్రవహిస్తోందని.. ఆ సంపద పాకిస్తాన్ రూపురేఖలను మార్చబోతోందని ఆమె పేర్కొన్నారు. గురువారం ఇస్లామాబాద్‌లో జరిగిన 'పాకిస్థాన్ మినరల్స్ ఇన్వెస్ట్‌మెంట్ ఫోరం'లో పాల్గొన్న ఆమె ఈ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

తనిష్క్ జ్యూవెలరీలో భారీ దోపిడీ.. రూ. 50 కోట్ల బంగారు ఆభరణాలు మాయం.. ఏం జరిగింది..?
తనిష్క్ జ్యూవెలరీలో భారీ దోపిడీ.. రూ. 50 కోట్ల బంగారు ఆభరణాలు మాయం.. ఏం జరిగింది..?

పంజాబ్ ఐదు నదుల భూమి అని పేర్కొన్న మరియం నవాజ్.. ముఖ్యంగా మియాన్‌వాలి, అటోక్ ప్రాంతాల్లోని నదీ తీరాల్లో 'ప్లేసర్ గోల్డ్' నిక్షేపాలు భారీగా ఉన్నట్లు సంకేతాలు లభించాయని వెల్లడించారు. రాళ్ల నుంచి విడిపోయి నదీ ప్రవాహంతో పాటు కొట్టుకువచ్చి ఇసుక, ఒండ్రుమట్టిలో పేరుకుపోయే బంగారాన్ని ప్లేసర్ గోల్డ్ అంటారు. శాస్త్రీయ పరీక్షలు, సర్వేల ద్వారా ఈ బంగారాన్ని వెలికితీసి, దేశ ఆర్థిక వనరుగా మార్చాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆమె వివరించారు.

Gold Flowing in Five Rivers of Punjab Claims Pakistan CM Maryam Nawaz at Minerals Forum Full Details

అసలు సమస్య భూమి పైన ఉన్న గందరగోళమే!
పాకిస్తాన్‌ను ఓ బంగారు గనిగా అభివర్ణించిన మరియం నవాజ్.. పంజాబ్ భూమి లోపల ఉన్న సహజ సంపద ఎన్నడూ సమస్య కాదన్నారు. దేశంలోని 4 ప్రావిన్సులలోనూ అపారమైన ఖనిజ సంపద ఉందన్నారు. కానీ అసలు సమస్యంతా భూమి పైన ఉన్న రాజకీయ, పరిపాలనా గందరగోళమే అని పేర్కొన్నారు. గత రెండున్నరేళ్ల క్రితం తమ గనులు, ఖనిజాల శాఖ ఆదాయం రూ.10 బిలియన్లు ఉండగా.. ఇప్పుడు అది రూ.40 బిలియన్లకు పెరిగిందని, ఇది కేవలం ఆరంభం మాత్రమేనని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

బంగారం ధరలు ఢమాల్.. భారీ పతనం
బంగారం ధరలు ఢమాల్.. భారీ పతనం

ఇనుప ఖనిజ నిక్షేపాలు.. పెట్టుబడిదారులకు రాయితీలు
బంగారంతో పాటు పంజాబ్‌లోని చినియోట్ ప్రాంతంలో 261.5 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజ నిక్షేపాలు ఉన్నాయని మరియం నవాజ్ వెల్లడించారు. విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు అనవసర ఆంక్షలు, పరిపాలనా జాప్యాలను తొలగిస్తున్నామని చెప్పారు. పెట్టుబడిదారులకు భూమి కొనుగోలు భారం లేకుండా రాయితీలు కల్పించడంతో పాటు 5 బిలియన్ పాకిస్తానీ రూపాయల వరకు రాయితీ రుణాలు, సౌర విద్యుత్ సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ముడి ఖనిజాల ఎగుమతి కాకుండా ప్రాసెసింగ్‌పై దృష్టి: ఇషాక్ దార్
ఈ కార్యక్రమంలో పాల్గొన్న పాకిస్తాన్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ మాట్లాడుతూ.. కేవలం ముడి ఖనిజాలను వెలికితీసి ఎగుమతి చేయడమే కాకుండా వాటి శుద్ధి చేసే సామర్థ్యాన్ని పాకిస్తాన్ పెంచుకోవాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ, కార్మికుల భద్రతతో పాటు స్థానిక ప్రజలకు కూడా ఈ మైనింగ్ ఆదాయంలో వాటా దక్కేలా చూడాలని ఆయన పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+