వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆన్‌లైన్ డేటింగ్ సైట్ల ద్వారా శృంగారం: హెచ్‌ఐవీ, జేబుకు చిల్లు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆన్‌లైన్‌లో మీకు సరైన జోడీని వెతుక్కోండి అంటూ డేటింగ్ వెబ్‌సైట్లు వల విసురుతుంటాయి. అలా చెప్పే సైట్లన్నీ మోసపూరితమైనవంటూ ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఆన్‌లైన్ డేటింగ్ వెబ్ సైట్ల ద్వారా జేబులకు చిల్లు పడటంతో పాటు, ప్రాణాంతకమైన వ్యాధుల వ్యాప్తికి కారణమవుతున్నాయని చెబుతోంది.

ఇద్దరి అంగీకారంతో శృంగారానికి వీలు కల్పించే ఈ డేటింగ్ వెబ్‌సైట్లు, తద్వారా హెచ్‌ఐవీ, ఇతర సుఖవ్యాధులకు సంబంధించిన వైరస్‌లను వ్యాపింపజేస్తున్నాయని ఈ అధ్యయనంలో పాలుపంచుకున్న ప్రొఫెసర్ రీతు అగర్వాల్ (రాబర్ట్ హెచ్‌స్మిత్ బిజినెస్ స్కూల్) తెలిపారు.

'Good guy' tired of women's online dating games

ఫ్లోరిడాలో నాలుగేళ్ల వ్యవధిలో హెచ్‌ఐవీ కేసుల సంఖ్య 13.5 శాతం పెరుగడానికి క్రెయిగ్ లిస్ట్ అనే అడల్డ్ డేటింగ్ వెబ్‌సైట్ కారణమయిందని ఈ అధ్యయనంలో వెల్లడైంది. ఈ డేటింగ్ వెబ్‌సైట్ ద్వారా ఎవరైతే శృంగారంలో కలిశారో వారిలో అత్యధికులకు హెచ్‌ఐవీ సోకినట్లు అధ్యయనంలో పేర్కొంది.

హెచ్‌ఐవీ నిర్మూలనకు ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నా, ఇలాంటి వెబ్‌సైట్లు మాత్రం మొత్తం వ్యవస్ధనే మార్చేస్తున్నాయని, ఈ శృంగార విషయాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అగర్వాల్ తెలిపారు.

English summary
Some online matching sites are better than others at attracting "real people." Use the site that best matches your personality. When you are matched with someone, be open and be yourself.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X