వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్ : త్వరలో కేక పుట్టించే ఫీచర్లతో
మనిషి జీవితాలన్ని సాంకేతికతతో ముడిపడి ఉన్న రోజులివి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ల హవా పెరగడంతో జనాలంతా సోషల్ మీడియా మానియాలో కొట్టుకుపోతున్న పరిస్థితి. సమయానికి ఏది ఉన్నా లేకపోయినా.. ఫోన్ లో ఛార్జింగ్ ఉంటే చాలు. వాట్సాప్, ఫేస్ బుక్ చాటింగ్ లతో ప్రపంచాన్నే మర్చిపోతారు. దీనికి తగ్గట్టే వాట్సాప్ లాంటి సోషల్ మీడియా యాప్ లు యూజర్ల కోసం మరిన్ని సదుపాయాలు కల్పించడానికి ఎప్పటికప్పుడు సన్నద్దమవుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే.. తాజాగా వాట్సాప్ మరో కొత్త సదుపాయాన్ని యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకురానుంది. స్కైప్, యాపిల్ వంటి యాప్స్ ను తట్టుకుని నిలబడ్దానికి వీలుగా సరికొత్త ఫీచర్ ను రూపొందించనుంది. ఇక నుంచి వాట్సాప్ ద్వారా కూడా వీడియో కాల్స్ చేసుకునేందుకు అణుగుణంగా ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. దీంతో డేటా కనెక్షన్ సదుపాయంతో వినియోగదారులు ఫేస్ టు ఫేస్ వీడియో కాలింగ్ చేసుకోవచ్చు.
వీడియో కాల్ తో పాటుగా కాల్ బ్యాక్, వాయిస్ మెయిల్, జిప్ ఫైల్ వంటి ఫీచర్స్ కూడా సపోర్ట్ చేసేలా వాట్సాప్ ను తీర్చిదిద్దడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఆండ్రాయిడ్ పోలీసు వెబ్ సైట్ వెలువరించిన కథనం ప్రకారం.. బెటా వెర్షన్ వాట్సాప్ వీడియో కాలింగ్ ఫీచర్ ను ప్రస్తుతం పరిశీలిస్తున్నట్టుగా సమాచారం. త్వరలోనే ఈ ఫీచర్ ను వాట్సాప్ కు జత చేసే అవకాశం కనిపిస్తోంది.
-
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!!












Click it and Unblock the Notifications