Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ట్రంప్‌కు షాక్: ప్రపంచ చరిత్రలో తొలిసారి గూగుల్, ఆపిల్, ఫేస్‌బుక్..

ఏడు ముస్లీం మెజార్టీ దేశాల పైన అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం పైన గూగుల్, ఆపిల్, ఫేస్‌బుక్, ఉబేర్ సర్వీసులు ఒక్కటయ్యాయి. ట్రంప్‌కు వ్యతిరేకంగా గళం విప్పాయి.

వాషింగ్టన్: ఏడు ముస్లీం మెజార్టీ దేశాల పైన అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం పైన గూగుల్, ఆపిల్, ఫేస్‌బుక్, ఉబేర్ సర్వీసులు ఒక్కటయ్యాయి. ట్రంప్‌కు వ్యతిరేకంగా గళం విప్పాయి.

ఏడు ముస్లిం మెజారిటీ దేశాలపై వీసా నిషేధాన్ని నిరసిస్తూ ఈ కార్పొరేట్ ధిగ్గజాలన్నీ కలిసి ట్రంప్‌కు లేఖ రాయనున్నాయి. ఓ వివాదాస్పద నిర్ణయంపై ఇలా పెద్ద కంపెనీలన్నీ కలిసికట్టుగా ముందుకు రావడం ప్రపంచంలో ఇదే తొలిసారి కావడం విశేషం.

వీసా నిషేధంపై గత వారం రోజులుగా అమెరికన్ల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. వలస కుటుంబాలు నెలకొల్పిన కంపెనీలతో నిండిపోయిన సిలికాన్‌ వ్యాలీలో నిరసనల తీవ్రత మరింత ఎక్కువగా కనిపిస్తోంది.

Google, Apple, Facebook plan to draft a joint letter opposing Trump's travel ban

సర్జీ బ్రిన్, టిమ్ కుక్, మార్క్ జుకెర్‌బర్గ్ సహా పలు కార్పొరేట్ అధినేతలు ట్రంప్ నిర్ణయాన్ని బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నారు. దాదాపు అన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీలూ అధ్యక్షుడి నిర్ణయంపై మండిపడ్డాయి.

ట్విటర్, ఎయిర్ బీఎన్‌బీ వంటి కంపెనీలు కూడా శరణార్థులకు అండగా ఉంటామని చెప్పాయి. ఆపిల్, ఫేస్‌బుక్, గుగూల్‌తో పాటు ఉబేర్ క్యాబ్‌లు కూడా ట్రంప్‌కు వ్యతిరేకంగా గళం విప్పాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+