ఆంక్షలు, హ్యాకింగ్స్: చైనాకు గుడ్‌బై చెప్పిన గూగుల్
న్యూయార్క్: ప్రపంచ దిగ్గజ సెర్చింజన్ గూగుల్.. చైనాకు పెద్ద షాక్ ఇచ్చింది. ఏ చిన్న సమాచారం కావాలన్నా ప్రస్తుతం అంతా గూగుల్‌పై ఆధారపడుతున్న విషయం తెలిసిందే. అయితే చైనాలో గూగుల్ తన కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది.
ఇక నుంచి సెర్చ్ ఇంజన్ గూగుల్ చైనాలో తమ కార్యకలాపాలన్నీ నిలిపివేస్తూ సంచలనం నిర్ణయం తీసుకుంది. ఇటీవల అక్కడ పెరిగిపోయిన హ్యాకింగ్ సమస్య, గత కొంత కాలంగా ఇంటర్నెట్ కార్యకలాపాల్లో చైనా ప్రభుత్వం విధిస్తున్న ఆంక్షలు, మార్కెటింగ్ తదితర సమస్యల వల్ల గూగుల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అంతేగాక, చైనా నుంచి గూగుల్ తన కార్యాలయాన్ని హాంకాంగ్‌కు మార్చివేసింది. ఇక నుంచి ‘గూగుల్.కామ్.కె' పేరిట తమ కార్యకలాపాలు కొనసాగుతాయని తెలిపింది. 400 మిలియన్ల జనాభా ఉన్న చైనా గూగుల్‌కు అతిపెద్ద బిజినెస్ మార్కెట్‌గా ఉంది. అయితే అక్కడి ప్రభుత్వం సెర్చ్ సర్వీసులపై ఆంక్షలు విధించడం, నిబంధనలు అనుకూలంగా లేకపోవడంతో గూగుల్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కాగా, ఈ పరిణామంపై చైనా ప్రభుత్వం గూగుల్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇది ఇలా ఉండగా బీజింగ్ హెడ్ క్వార్టర్స్‌లోని గూగుల్ కార్యాలయం ఎదుట మద్దతుదారులు పూల బొకేలు, చాకోలెట్లు పెట్టి నిరసన వ్యక్తం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications