యాపిల్‌కు రూ. 65వేల కోట్లు చెల్లిస్తున్న గూగుల్: ఎందుకో తెలుసా?
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ప్రముఖ మొబైల్, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ యాపిల్‌కు ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ భారీ మొత్తాన్ని చెల్లించనుంది. ఐఫోన్‌లోని సఫారీ వెబ్ బ్రౌజర్‌లో గూగుల్‌ను డీఫాల్ట్ సెర్చ్ ఇంజిన్‌గా ఉంచేందుకు యాపిల్‌కు గూగుల్ 9బిలియన్ డాలర్లు (సుమారు రూ.65వేల కోట్లు) చెల్లించనుందని తెలిసింది.
2013, 2014 సంవత్సరాల్లో ఇందుకు గాను గూగుల్ బిలియన్ డాలర్లు చెల్లించగా.. 2017లో 3బిలియన్ డాలర్లు చెల్లించింది. ఈ ఏడాది రెట్టింపు కన్నా ఎక్కువ మొత్తం 9బిలియన్ డాలర్లు చెల్లించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోందని విశ్లేషకులు తెలిపారని బిజినెస్ ఇన్‌సైడర్ నివేదికలో వెల్లడించింది.

డీఫాల్ట్ సెర్చ్ ఇంజిన్ కోసం 2019లో గూగుల్ యాపిల్‌కు 12బిలియన్ డాలర్లు (రూ.87వేల కోట్లు) చెల్లించే అవకాశముందని తెలిపింది. యాపిల్ నుంచి ఎక్కువ మంది వినియోగదారులు గూగుల్ సెర్చ్ ఇంజిన్‌ను ఉపయోగిస్తున్నారని నివేదికలో పేర్కొంది.
గూగుల్‌కు వినియోగదారుల ట్రాఫిక్ వచ్చే ముఖ్యమైన ఆధారాల్లో యాపిల్ ప్రధానమైనదని గూగుల్ విశ్వసిస్తుందని వివరించింది. యాపిల్ ఐఫోన్లు, ఐపాడ్స్ సహా ఐఓఎస్ పరికరాల్లో సఫారీలో గూగుల్‌ను డీఫాల్ట్ సెర్చ్ ఇంజిన్‌గా ఉపయోగిస్తోంది.
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!!












Click it and Unblock the Notifications