Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

H-1B వీసాదారులకు బిగ్ అప్‌డేట్ ఇచ్చిన Google: గ్రీన్ కార్డ్ ప్రాసెస్ రీస్టార్ట్

అమెరికాలో H-1B వీసాలపై పనిచేస్తున్న వేలాది మంది గూగుల్ ఉద్యోగులకు భారీ ఊరట లభించింది. గత రెండేళ్లుగా నిలిపివేసిన గ్రీన్ కార్డ్ దరఖాస్తుల ప్రక్రియను 2026 నుండి పెద్ద ఎత్తున తిరిగి ప్రారంభించాలని గూగుల్ నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రోగ్రామ్ ఎలక్ట్రానిక్ రివ్యూ మేనేజ్మెంట్ (PERM-Program Electronic Review Management) దరఖాస్తుల ఆమోద ప్రక్రియను వేగవంతం చేయడానికి అవసరమైన ప్రణాళికలను రూపొందించుకుంది.

అమెరికాలో ఎంప్లాయ్ మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డ్ ప్రక్రియలో ఈ PERM అనేది కీలకం. విదేశీ ఉద్యోగులను నియమించడం ద్వారా అమెరికా నిపుణులపై ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండబోదని.. అలాగే సదరు ఉద్యోగానికి తగిన అర్హత గల నిపుణులు అమెరికాలో లేరని, అందువల్లే విదేశీ ఉద్యోగులను నియమించుకోవాల్సి వచ్చిందని ఈ PERM ప్రక్రియ ద్వారా ఆయా కంపెనీలు ప్రభుత్వానికి తెలియజేస్తాయి. దీనివల్ల అడ్మినిస్ట్రేషన్ నుంచి ఇబ్బందులు ఉండవు.

Google to restart green card process in 2026 for H1B visa holders

ఈ ప్రాసెస్ ను రెండేళ్ల కిందట నిలిపివేసింది గూగూల్. 2026లో దీన్ని పునరుద్ధరించాలని నిర్ణయించుకుంది. ఈ నిర్ణయం భారతీయ టెక్కీల నెత్తిన పాలుపోసినట్టే అవుతుంది. సాధారణంగా టెక్ కంపెనీలు ఈ ప్రక్రియ ద్వారానే తమవద్ద తాత్కాలిక వీసా కింద పని చేస్తోన్న ఉద్యోగులకు శాశ్వత నివాస హోదాను పొందడానికి సహాయపడతాయి. గ్రీన్ కార్డుల వీసా ప్రాసెసింగ్ సైతం దీనితోనే ముడిపడి ఉంటుంది. 2026 మొదటి త్రైమాసికంలో PERMకు అర్హత పొందిన ఉద్యోగులను గూగుల్ సంప్రదింపులు మొదలు పెట్టనుంది.

దీనికి సంబంధించి గూగుల్ ఇప్పటివరకు ఎటువంటి బహిరంగ ప్రకటన చేయలేదు. అయినప్పటికీ- ఇంటర్నల్ కమ్యూనికేషన్ల కాపీలు లీక్ కావడంతో ఈ వార్త వెలుగులోకి వచ్చింది. H-1B, ఇతర వర్క్ వీసాలపై పనిచేస్తున్న టెక్ నిపుణులు అనేక సవాళ్లను ఎదుర్కొంటోన్న ప్రస్తుత పరిస్థితుల్లో గూగుల్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల చాలామంది టెక్కీలకు ఊరట లభించినట్టవుతుంది. వీసా ఫీజుల పెంపు, దీని ప్రాసెసింగ్ లో నెలకొన్న తీవ్ర జాప్యం, ఇమ్మిగ్రేషన్ పాలసీలలో మార్పులతో వాళ్లంతా ఆందోళన, గందరగోళానికి గురి అవుతున్నారు.

గ్రీన్ కార్డ్ ప్రక్రియను 2023 జనవరిలో గూగుల్ నిలిపివేసింది. అదే సమయంలో కంపెనీ సుమారు 12,000 మంది ఉద్యోగులను తొలగించినట్లు ప్రకటించింది. అప్పట్లో అమెజాన్, మెటా వంటి ఇతర టెక్ దిగ్గజాలు కూడా ఇలాంటి చర్యలే తీసుకున్నాయి. పెద్ద సంఖ్యలో అమెరికన్ ఉద్యోగుల తొలగింపు నేపథ్యంలో, PERM నిబంధనల ప్రకారం స్థానిక ప్రతిభ అందుబాటులో లేదని నిరూపించడం కంపెనీలకు కష్టతరమైంది. ఇదే విదేశీ ఉద్యోగుల స్పాన్సర్‌షిప్‌కు అడ్డంకిగా మారింది.

గూగుల్‌లో వీసాపై ఉన్న ప్రతి ఉద్యోగి దీనికి అర్హులు కారు. కొన్ని కండీషన్లు పెట్టింది గూగుల్. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ పనిచేస్తున్న ఉద్యోగులు మాత్రమే అర్హులు. రిమోట్‌లో పని చేస్తున్న ఉద్యోగులు PERM కిందికి రావాలంటే ఆఫీస్ కు రావాల్సి ఉంటుందని మెమో స్పష్టం చేసింది. లెవెల్ 3 లేదా అంతకంటే తక్కువ స్థాయిలోని ఉద్యోగులను ఇందులో చేర్చే అవకాశాలు తక్కువే. అలాగే పెర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్, మోడరేట్ ఇంపాక్ట్ పాటించడం అవసరం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+