జాగ్రత్త..గూగుల్ మీ కదలికలను గమనిస్తోంది..!

మీరు ఎవ్వరికీ తెలియకుండా రహస్యంగా ఎక్కడికైనా వెళ్లాలనుకుంటున్నారా..? అయితే జాగ్రత్త మీరెక్కడున్నారో...మీ ప్రతి కదలిక గూగుల్ పసిగడుతోంది. ఈ విషయం అసోసియేటెడ్ ప్రెస్ విచారణలో తేలింది. మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లో ప్రతి గూగుల్ సర్వీసు మీరున్న ప్రదేశాన్ని నిక్షిప్తం చేసి ఉంచుతోందని వారి విచారణలో వెల్లడైంది.

మీరు ఏదైనా యాప్ ఇన్స్‌టాల్ చేసుకుంటే వెంటనే లొకేషన్ యాక్సెస్‌కు అనుమతి అడుగుతుంది. మీరు ఓకే చెబితే మీరున్న లొకేషన్‌ను స్టోర్ చేసి ఉంచుతుంది. ఉదాహరణకు గూగుల్ మ్యాప్స్‌లో లొకేషన్ గురించి అడిగితే ముందుగా లొకేషన్ యాక్సెస్‌కోసం అనుమతి కోరుతుంది. మీరు ఒప్పుకుంటే ఇక అక్కడి నుంచి మీరు ఏయే ప్రదేశాల్లో తిరిగారో.. ఎక్కడెక్కడికి వెళ్లారో మీ రోజూవారీ కదలికలను తేదీ సమయంతో సహా బయటపెడుతుందని కొందరు కంప్యూటర్ సైన్స్ పరిశోధకులు వెల్లడించారు. ఒకవేళ మీరు ఏకాంతంగా ఎక్కడికైనా వెళ్లినా అన్ని విషయాలు నిమిషాలతో సహా బయటపెడుతుందని వారు చెబుతున్నారు.

 Google tracking your daily movements, reveals investigation

ఇదిలా ఉంటే గూగుల్ మాత్రం అలాంటిదేమీ లేదని చెబుతోంది. లొకేషన్ హిస్టరీని ఎప్పుడైనా మీరు ఆఫ్ చేయొచ్చని చెబుతోంది. లొకేషన్ హిస్టరీ ఆఫ్ చేస్తే ఇక అప్పటి నుంచి మీరెక్కడికెళ్లినా ఆ ప్రదేశాలు సేవ్ అవ్వవని గూగుల్ సంస్థ వెల్లడించింది. అయితే గూగుల్ వివరణతో పరిశోధకులు విబేధించారు. లొకేషన్ హిస్టరీ ఆఫ్ చేసినప్పటికీ.. కొన్ని గూగుల్ యాప్స్ ఎవరి ప్రమేయం లేకుండానే మీరున్న ప్రాంతాన్ని స్టోర్ చేసి పెట్టుకుంటుందని పరిశోధకులు తెలిపారు. ఇలా తామున్న ప్రాంతాన్ని గూగుల్ యాప్స్ స్టోర్ చేసి ఉంచుకోవడంతో రెండు బిలియన్ ఆండ్రాయిడ్ వినియోగదారులు కష్టాలు కోరి తెచ్చుకుంటున్నారని వారు అనుమానం వ్యక్తం చేశారు. ఐఫోన్ వినియోగదారులు కూడా ఇదే ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వారి పరిశోధనల్లో తేలిందని వివరించారు.

ఇదిలా ఉంటే తాము గూగుల్ ద్వారా ఏదైతే సర్వీసులు అందిస్తున్నామో... ఆ సర్వీసుల గురించి పూర్తిగా వివరాలు ఉంచుతున్నామని గూగుల్ అధికారి ఒకరు తెలిపారు. దీని ద్వారా వినియోగదారుడు ఎప్పుడైనా లొకేషన్ హిస్టరీని డిలీట్ చేసుకోవచ్చని చెబుతున్నారు. అంతేకాదు గూగుల్ పేజ్ పై మీ లొకేషన్లు ఏవైనా స్టోర్ అయి ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు myactivity.google.comకు లాగిన్ అయి చెక్ చేసుకోవచ్చిన అధికారులు తెలిపారు. అంతేకాదు వెబ్ అండ్ యాప్ యాక్టివిటీని డిసేబుల్ చేయడం ద్వారా లోకేషన్ మార్కర్లను స్టోర్ చేసే వీలుండదని అధికారులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+