Youtube: యూట్యూబ్ నుంచి మరో ఫీచర్.. అదేమిటంటే..!
గూగుల్ యూట్యూబ్ లో కొత్త ప్రయోగం చేయనుంది. యూట్యూబ్ వీడియోల నుంచి షార్ట్స్ రూపంలో కామెంట్ చేసేందుకు వీలుగా ఓ కొత్త ఫీచర్ ను తీసుకురానుంది. ఈ ఫీచర్ వస్తే యూట్యూబ్ క్రియేటర్లు తమ సొంత కంటెంట్ తో షార్ట్స్ రూపంలో కామెంట్ చేసుకోవచ్చు. అయితే యూట్యూబ్ వీడియోలకు కామెంట్ చేసేందుకు ఇప్పకిటికో ఉన్న దానికి ఈ ఫీచర్ అడ్వాన్స్ గా ఉండనుందని తెలుస్తోంది.
ఈ ఫీచర్ కు సంబంధించి ట్రయల్స్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ ఫీచరే కాకుండా వీడియో ప్లేయర్ లో లాంగ్ ప్రెస్ ఫీచర్ ద్వారా ఎక్కడైనా నొక్కి పట్టుకుంటే వీడియో ప్లే బ్యాక్ స్పీడ్ అటోమెటిక్ గా 2x కి పెంచుకోవచ్చని గూగుల్ తెలిపింది. వీడియో ద్వారా అవసరమైన చోట పెద్ద ప్రివ్యూలో చూసే ఫీచర్ కూడా తీసుకురానుంది.

అంతేకాదు వీడియో ప్లే అవుతున్న సమయంలో ఎలాంటి అడ్డంకులు చేకుండా ఉండేందుకు లాక్ స్క్రీన్ ఫీచర్ పై కూడా గూగుల్ ట్రయల్స్ చేస్తోంది. మానిటైజేషన్ కు సంబంధించి గూగుల్ ఈ మధ్య నిబంధనలు మార్చింది. నిబంధనల మార్పు తర్వాత క్రియేటర్లు యూట్యూబ్ పార్టనర్ ప్రోగ్రామ్ లో చేరడానికి 500 మంది సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉండాలి. గత 90 రోజుల్లో మూడు పబ్లిక్ అప్‌లోడ్‌లు చేయడంతో పాటు సంవత్సర కాలంలో 3,000 గంటల వాచ్ అవర్స్ ఉండాలి. లేదా చివరి 90 రోజుల్లో 3 మిలియన్ షార్ట్స్ వ్యూస్ ఉండాలి.
అంతకు ముందు మానిటైజేషన్ అప్లయ్ చేయాలంటే సంవత్సర కాలంలో 1000 బ్‌స్క్రైబర్లు, 4000 గంటల వాచ్ అవర్స్ లేదా కోటి షార్ట్స్ వ్యూస్ ఉండాలి. మానిటైజేషన్ చేసుకున్న వారు సూపర్ థాంక్స్, సూపర్ చాట్, సూపర్ స్టిక్కర్‌లు మరియు ఛానెల్ మెంబర్‌షిప్ వంటి ఫ్యాన్ ఫండింగ్ ఫీచర్‌లకు యాక్సెస్ చేసేందుకు అవకాశం ఉంటుంది.
-
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది -
ఇళ్ళస్థలాలు లేనివారికి రేవంత్ సర్కార్ శుభవార్త.. రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే.. -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !!












Click it and Unblock the Notifications