డబ్బుకు నో: పెయింటర్ ఫేస్‌బుక్ షేర్లు 1,270 కోట్లు
న్యూయార్క్: పెయింటింగ్ పని చేసిన తర్వాత డబ్బులకు బదులు షేర్లు తీసుకున్నాడు. నేడు ఆ షేర్లు విలువ వెయ్యి కోట్ల రూపాయలకు పైగా దాటి పోవడంతో అతని ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. అతను తీసుకున్నది ఫేస్‌బుక్ షేర్లు. అందుకే దాని విలువ అంత పెరిగిపోయింది.
వివరాలలోకి వెళ్తే, 10 సంవత్సరాల క్రితం 2005లో ఫేస్‌బుక్ వ్యవస్థాపక అధ్యక్షుడు షాన్ పార్కర్ తన ప్రధాన కార్యాలయం ప్రారంభించే సమయంలో పెయింటర్ డేవిడ్ చోను సంప్రదించాడు. తన కార్యాలయానికి రంగులు వేయాలని చెప్పాడు.
డేవిడ్ చో భవనం మొత్తం పరిశీలించాడు. ఈ భవనానికి రంగులతో పాటు మంచి పెయింటింగ్స్ వేస్తానని చెప్పాడు మొత్తం 60 వేల డాలర్లు ఖర్చు అవుతుందని షాన్ పార్కర్ కు చెప్పాడు. అయితే తాము ఇప్పుడే కంపెనీ ప్రారంభిస్తున్నామని అంత నగదు చెల్లించలేమని షాన్ పార్కర్ అన్నాడు.

మీరు పెయింట్స్ వేస్తే మా కంపెనీలో మీకు షేర్లు (వాటాలు) ఇస్తానని చెప్పాడు. షాన్ పార్కర్ లో ఉన్న తెలివితేటలు, అతని దూరదృష్టిని పసిగట్టిన డేవిడ్ చో సరే అన్నాడు. భవనం మొత్తం మంచి రంగులు, పెయింట్స్ వేశాడు.
ఆ సమయంలో ఫేస్‌బుక్ లో డేవిడ్ చోకు కొన్ని షేర్లు ఇచ్చారు. తరువాత కొంత కాలానికి ఫేస్‌బుక్ లో పెట్టుబడులు పెట్టడానికి సహ వ్యవస్థాపకులను షాన్ పార్కర్ ఒప్పించాడు. అంతే ఫేస్‌బుక్ కంపెనీ వెనక్కి తిరిగి చూసుకోలేదు.
దశాబ్ద కాలంలోనే ఫేస్‌బుక్ కంపెనీ షేర్లు అనూహ్యంగా పెరిగిపోయాయి. ఆ రోజు షాన్ పార్కర్ పెయింటర్ డేవిడ్ చోకు ఇచ్చిన షేర్లు విలువ నేడు అక్షరాల రూ. 1,270 కోట్లుకు చేరింది. తనకు ఆ రోజు షాన్ పార్కర్ షేర్లు ఇవ్వకుంటే ఇంత డబ్బు సంపాదించేవాడిని కాదని డేవిడ్ చో సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.












Click it and Unblock the Notifications