గ్రీన్ కార్డు: అమెరికాకు ఇక స్వేచ్ఛగా ..విమర్శలకు జడిసేనా?
గ్రీన్ కార్డు కలిగి ఉన్నవారు అమెరికా నుండి యధేచ్చగా రాకపోకలను సాగించవచ్చని ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు బుదవారం నాడు అమెరికా ప్రతినిధి ఈ మేరకు ఓ ప్రకటన చేశారు.
వాషింగ్టన్ :అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు తీసుకొన్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత వ్యకమౌతున్న నేపథ్యంలో కొన్ని నిర్ణయాలపై మార్పులు చేర్పులు చేసింది అమెరికా ప్రభుత్వం. గ్రీన్ కార్డు కలిగిన ఉన్నవారికి అమెరికా దేశానికి రాకపోకలపై ఉన్న నిషేధాన్ని తొలగిస్తూ ఆ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.
అమెరికా దేశానికి ఏడు దేశాల నుండి రాకపోకలను నిషేధిస్తూ ఆ దేశాధినేతగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత నిర్ణయం తీసుకొన్నాడు. ఈ నిర్ణయంపై నిరసనలు వెల్లువెత్తాయి.

ఈ నిరసనల నేపథ్యంలో ప్రభుత్వం కొంత వెనక్కు తగ్గింది. అమెరికాలో గ్రీన్ కార్డు కలిగిన ఉన్నవారికి అమెరికాకు స్వేఛ్చగా తిరిగి వచ్చే అవకాశాలను కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.ఈ మేరకు వైట్ హౌజ్ అధికార ప్రతినిధి స్పైసర్ బుదవారం నాడు ఈ ప్రకటన చేశారు.
ప్రధానంగా ఏడు ముస్లిం దేశాలపై ట్రంప్ ప్రభుత్వం నిషేదాన్ని విధించింది.ఈ మేరకు గత శుక్రవారం నాడు ట్రంప్ ఈ నిషేధపు ఉత్తర్వులపై సంతకం చేశాడు. దీనిపై నిరసనలు వెల్లువెత్తడంతో కొన్ని మినహయింపులు ఇస్తూ ట్రంప్ సర్కార్ నిర్ణయం తీసుకొంది.
ట్రంప్ నిర్ణయం తీసుకొన్న కొద్ది గంటల్లోనే గ్రీన్ కార్డు దారులైన వారిని కూడ ప్రయాణంపై నిషేధాన్ని విధించింది ప్రభుత్వం. అయితే మంగళవారం నాటికి వెయ్యి మంది గ్రీన్ కార్డు దారులు ప్రత్యేక అనుమతిని పొందారు.
అయితే గ్రీన్ కార్డు హోల్డర్స్ కు మాత్రం అమెరికా నుండి రాకపోకలపై నిషేధం ఉండదని వైట్ హౌజ్ ప్రతినిధి ప్రకటించింది.












Click it and Unblock the Notifications