వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అవన్నీ అబద్ధాలే: సచిన్‌పై విరుచుకుపడ్డ చాపెల్

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తనపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌పై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, భారత క్రికెట్ జట్టు మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ తీవ్రంగా విరుచుకపడ్డాడు. టెండూల్కర్ తన ఆత్మకథలో రాసినవన్నీ అబద్ధాలేనని ఆయన అన్నాడు. చాపెల్ రింగ్ మాస్టర్‌గా వ్యవహరించాడని, తన ఆలోచనలను ఆటగాళ్లపై రుద్దడానికి ప్రయత్నించాడని సచిన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

భారత జట్టు కెప్టెన్‌గా రాహుల్ ద్రావిడ్ స్థానంలో సచిన్ టెండూల్కర్‌ను నియమించాలని తాను ఏ మాత్రం ప్రయత్నం చేయలేదని చాపెల్ మంగళవారంనాడు స్పష్టం చేశాడు. సచిన్ ఈ విషయంలో చెప్పిన విషయంలో ఏ మాత్రం నిజం లేదని అన్నాడు. ప్లేయింగ్ ఇట్ మై వే అనే ఆత్మకథలో గ్రెగ్ చాపెల్‌పై టెండూల్కర్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.

greg chappell hits back at Sachin, says claims are untrue

గ్రెగ్ చాపెల్ రెండేళ్ల పాటు 2007 ప్రపంచ కప్ పోటీల వరకు భారత జట్టు కెప్టెన్‌గా ఉన్నాడు. చాపెల్ భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీతో తీవ్ర విభేదాలు సృష్టించుకున్నాడు. చాపెల్‌పై సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యలను భారత మాజీ కెప్టెన్లు రాహుల్ ద్రావిడ్, సౌరవ్ గంగూలీ కూడా సమర్థించారు.

2007 ప్రపంచ కప్‌కు ముందు ద్రావిడ్‌ను తప్పించి తనను కెప్టెన్సీ చేపట్టమనే షాకింగ్‌ సలహాను మాజీ ఆస్ట్రేలియా క్రికెటర్ చాపెల్ ఇచ్చాడని సచిన్‌ చెప్పాడు. ఇద్దరం కలిస్తే భారత క్రికెట్‌ను కొన్నేళ్ల పాటు శాసించవచ్చని తనతో అన్నాడని చెప్పాడు. అందుకు తగిన సహకారం అందిస్తానని చాపెల్‌ చెప్పినట్లు మాస్టర్‌ సచిన్‌ తన ఆత్మకథలో రాశాడు.

ప్రపంచ కప్ పోటీలకు కొన్ని నెలల ముందు చాపెల్‌ తమ ఇంటికి వచ్చాడని, అప్పటి కెప్టెన్‌ రాహుల్‌ ద్రావిడ్‌ను తప్పించి కెప్టెన్సీ చేపడితే.. ఇద్దరం కలసి కొన్నేళ్ల పాటు భారత క్రికెట్‌ను నియంత్రిచవచ్చుననీ ఇందుు తాను పావులు కదుపుతాననీ చాపెల్ చెప్పాడని వెల్లడించాడు. "గ్రెగ్‌ మాటలకు నేను, అంజలి నిర్ఘాంతపోయాం. కెప్టెన్‌ అంటే కనీస గౌరవం కూడా లేకుండా కోచ్‌ మాట్లాడడం నాకు బాధకలిగించింద'ని టెండూల్కర్‌ రాశాడు. అయితే చాపెల్‌ ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చానని సచిన్‌ పేర్కొన్నాడు.

English summary
Former India coach Greg Chappell hit back at Sachin Tendulkar on Tuesday stating that the claims made by the latter in his autobiography is untrue. Tendulkar had accused Greg Chappell of being a "ringmaster" who imposed his ideas on players.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X