పెళ్లి ఫోటో షూట్: భార్యను ముద్దాడుతుంటే పాము కాటేసింది

ఫోర్ట్ కొలిన్స్: తన మనసుకి నచ్చిన యువతిని పెళ్లాడి అనంతరం భార్యతో కలిసి ఫోటోలు దిగుతున్న వేళ ఆ పెళ్లి కొడుకు పాముకాటుకు గురయ్యాడు. ఈ సంఘటన కోలో‌లోని ఫోర్ట్ కోలిన్స్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... జానీ, లౌరా బెన్సన్ నెలల తరబడి ప్రణాళికలు వేసుకుని ఫోర్ట్ కోలిన్స్‌లోని కేథలిక్ చర్చిలో వైభవంగా పెళ్లి చేసుకున్నారు.

పెళ్లి అనంతరం ఏర్పాటు చేసిన రిసెప్షెన్‌కు ముందు సమీపంలోని హార్స్ టూత్ రిజర్వాయర్ అటవీ ప్రాంతంలో పెళ్లి ఫోటో షూట్‌కు ఫోజులు ఇచ్చేందుకు వెళ్లారు. నవ్వుతూ ఒకరిని మరొకరు ముద్దాడుతున్న సమయంలో పెళ్లికొడుకు జానీని పాము కాటేసింది.

groom

"నా కాలుపై ఏదో గుచ్చుకున్నట్టు అనిపించింది. అది ఏదైనా పాము కాటా? కాదా? అన్నది తెలియదు. అనుమానంతో కిందకు చూశాను. ఓ రాటిల్ స్నేక్ కనిపించింది. నన్ను పాము కరిచిందా? అన్న అనుమానంతో విషయాన్ని లౌరాకు చెప్పాను. ఆమె ముందు కాలి మడమను పరిశీలించమని చెప్పింది. పాము కరచిన గుర్తులను చూసి తీవ్ర ఆందోళన చెందాను" అని తన అనుభవాన్ని పంచుకున్నారు.

అప్పటికీ, పాము కాటు ప్రభావం తన శరీరానికి తెలియలేదని, ఎంతో ఖర్చు పెట్టి ఏర్పాటు చేసుకున్న పెళ్లి రిసెప్షన్ వేడుక ఎక్కడ ఆగిపోతుందోననే ఆలోచనే తనను మదిలో మెదిలిందని జానీ పేర్కొన్నారు. అయితే తనను పాము కరిచిన విషయాన్ని అక్కడే ఉన్న వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ మాడీ మేయ్, పార్క్ రేంజర్లకు సమాచారాన్ని అందించారు.

నిజానికి రాటిల్ స్నేక్ చాలా విషపూరితం. కాటు వేసిందంటే శరీరం చచ్చుబడటంతో పాటు శ్వాస సరిగ్గా తీసుకోలేరు. అంతేకాదు రాటిల్ స్నేక్ యాంటీ వెనమ్ కూడా చాలా ఖరీదుతో కూడుకున్నది. అందుబాటులో ఉన్న అంబులెన్స్‌లో కూడా యాంటీ వెనమ్ లేకపోవడంతో వెంటనే పారామెడికల్ సిబ్బందికి ఫోన్ చేసి జరిగిన విషయాన్ని వెల్లడించారు.

దీంతో జానీని వెంటనే ఓ రూమ్‌కు తరలించి పారామెడికల్ ఎమర్జెన్సీ సిబ్బంది అత్యవసర చికిత్స చేశారు. అయితే జానీని పాము కాటు వేయలేదని, పాము లాగా ఉండే మరో జంతువు కాటేసి ఉండవచ్చని అందువల్లే జానీ శరీరంలోకి విషం చేరలేదని తేల్చారు.

ఈ ఒక్క మాటతో జానీ ప్రాణాలు లేచి వచ్చినట్లుగా అయింది. తనకు ప్రాణాపాయం లేదని తెలుసుకున్న జానీ, లౌరాలిద్దరూ ఓ గంట ఆలస్యంగా రిసెప్షన్‌కు వెళ్లారు. అప్పటికే వీరిద్దరి కోసం వేచి చూస్తున్న బంధువులు, స్నేహితులు పాము కాటు నుంచి తప్పించుకున్న అతని అభినందిస్తూ 'జానీ రాటిల్ స్నేక్' అని ఆటపట్టించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+