జడుసుకోవడం పక్కా.. తలనొప్పికి ఇంత భయానక చికిత్సా! (వీడియో)

బీజింగ్ : ఓవైపు ప్రపంచమంతా వైద్య శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకెళుతుంటే.. మరోవైపు మూఢ నమ్మకాలతోనే ఇంకా కాలం వెళ్లదీస్తోన్న గ్రామాలు కూడా ప్రపంచవ్యాప్తంగా చాలానే ఉన్నాయి. ఇదే తరహాలో చైనాలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ ఓ మూఢాచారం రాజ్యమేలుతోంది.

తలనొప్పి వస్తే.. ఎవరైనా మెడిసిన్ వేసుకుంటారు లేదంటే జండుబామ్ రాసుకోవడమో లేక ఓ వేడి వేడి ఛాయ్ సిప్ చేయడమో చేస్తారు. కానీ చైనాలోని కొన్ని ప్రాంతాల్లో అలా కాదు. ఓ పదునైన చువ్వలాంటి వస్తువుతో ఏకంగా నుదుటిపై రంధ్రం చేసి ఆ రక్తాన్ని ఓ టబ్ లో పడుతారు. అలా ఎక్కడ నొప్పిగా ఉంటే అక్కడ రంధ్రం చేసి రక్తాన్ని బయటకు పంపించడం ద్వారా తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చుననేది అక్కడివారు ఏళ్లుగా అనుసరిస్తోన్న ఓ మూఢ నమ్మకం.

ఎవరు తీశారో తెలియదు గానీ మొత్తానికి ఎవరో అనామకుడు ఈ వీడియోను ఇంటర్నెట్ లోకి ఎక్కించడంతో... చైనా ప్రజల మూఢ నమ్మకాలను చూసి నివ్వెరపోతున్నారు జనం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+