నింగిలోకి దూసుకెళ్లిన జీశాట్ - 31 ఉపగ్రహం.. కమ్యూనికేషన్ సేవలు మరింత మెరుగు
Recommended Video

కౌరో : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ - ఇస్రో ఖాతాలో మరో విజయం చేరింది. వరుస ప్రయోగాల సక్సెస్ తో దూసుకెళుతున్న ఇస్రో.. తాజాగా భారత కమ్యూనికేషన్ ఉపగ్రహం జీశాట్ - 31 ను సక్సెస్ ఫుల్ గా నింగిలోకి పంపింది. ఫ్రెంచ్ గయానాలోని కౌరు లాంచ్ కాంప్లెక్స్ నుంచి చేపట్టిన రాకెట్ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు.
ఏరియన్ స్పేస్ సంస్థకు చెందిన ఏరియానా రాకెట్ ద్వారా జీశాట్ - 31 ఉపగ్రహాన్ని గగనతలంలోకి పంపించారు. భారత కాలమాన ప్రకారం బుధవారం తెల్లవారుజామున 2 గంటల 31 నిమిషాలకు నింగిలోకి దూసుకెళ్లింది ఈ ఉపగ్రహం. జీశాట్ -31 ఉపగ్రహంతో పాటు సౌదీకి చెందిన 1 హెల్లాస్ శాట్ -4 ఉపగ్రహాన్ని కూడా మోసుకెళ్లింది ఏరియన్ 5 రాకెట్. కమ్యూనికేషన్ సేవలను మరింత మెరుగ్గా అందించనున్న జీశాట్ - 31.. నలభై రెండు నిమిషాల వ్యవధిలోనే నిర్ణీత కక్ష్యలోకి చేరుకుంది.

2,535 కిలోల బరువున్న ఈ ఉపగ్రహం దాదాపు 15 ఏళ్లపాటు నిరంతరాయంగా కమ్యూనికేషన్ సేవలు అందించనుంది. ఇన్‌శాట్, జీశాట్ ఉపగ్రహాలకు ఇది కొత్త రూపంగా అభివర్ణిస్తున్నారు శాస్త్రవేత్తలు. డీటీహెచ్ టీవి, డిజిటల్ శాటిలైట్, టీవి అప్‌లింక్స్ తదితర వాటికి అనుగుణమైన టెక్నాలజీ దీని సొంతం.
#Arianespace orbits two telecommunications satellites on first #Ariane5 launch of 2019. Read the #VA247 press release: https://t.co/ze1oCSAFoj pic.twitter.com/e3Bll545lu
— Arianespace (@Arianespace) February 5, 2019
-
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
IPL 2026: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. 14 ఏళ్ల తర్వాత బోణీ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications