అమెరికాలో మరోసారి కాల్పులు: ఐదుగురు మృతి, హంతకుడి ఆత్మహత్య

కాలిఫోర్నియా: అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. దక్షిణ కాలిఫోర్నియాలోని బేకర్స్‌ ఫీల్డ్‌ సిటీలో ఓ దుండగుడు తుపాకీతో విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో అతడి భార్య సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.

అనంతరం దుండగుడు కూడా తనని తాను కాల్చుకున్నాడు. బుధవారం సాయంత్రం 5.30 గంటల సమయంలో ఈ ఘటన టుచేసుకుంది. బేకర్స్‌ఫీల్డ్‌లోని ఓ ట్రక్కింగ్‌ కంపెనీ వద్ద ఈ ఘటన జరిగినట్లు కెర్న్‌ కౌంటీ అనే సంస్థ వెల్లడించింది.

Gunman kills 5, self in Southern California

కాగా, దుండగుడు ముందుగా నగరంలోని ఓ ప్రాంతంలో ఓ వ్యక్తిని కాల్చాడని, అనంతరం సమీపంలోని ఓ ఇంటికి వెళ్లి మరో ఇద్దరిని హతమార్చి వాహనంలో ట్రక్కింగ్‌ కంపెనీ వద్దకు చేరుకుని మరోసారి కాల్పులు జరిపినట్లు సంస్థ వెల్లడించింది.

ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అమెరికాలో వారం వ్యవధిలో కాల్పుల ఘటన చోటుచేసుకోవడం ఇది రెండోసారి. ఐదురోజుల క్రితం సిన్సినాటిలోని ఓ బ్యాంకు వద్ద దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పృథ్వీరాజ్‌ అనే సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కూడా ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+