రేపిస్ట్ సహా మరో వ్యక్తి కాల్పులు: 11 మంది బలి

మెక్సికో: సాయుధులు జరిపిన కాల్పుల్లో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది బలయ్యారు. సెంట్రల్ మెక్సికోలోని ఓ గ్రామంలో గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత ఈ సంఘటన జరిగింది. ఓ రేపిస్టు సహా మరో వ్యక్తి ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. స్థానిక మేయర్ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

ఓ కుటుంబంపై కక్ష గట్టిన వ్యక్తి, మరో వ్యక్తితో కలిసి ఆయుధాలతో ఇంట్లోకి ప్రవేశించి కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 11 మంది మరణించారు. మరణించినవారిలో ఐదుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు, నలుగురు పురుషులు ఉన్నారు. మరో ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు.

Gunmen in Mexico kill 11 in attack on family

గాయపడినవారిని తెహ్యూకన్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. కాల్పాలు జరిపిన ప్రత్యక్షంగా చూసిన ఐదుగురు వ్యక్తులు ప్రభుత్వాధికారుల రక్షణలో ఉన్నారు. కాల్పులు జరిపిన తర్వాత వారిద్దరు అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులు తెలిపారు. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాల ఆధారంగా ఇద్దరిని గుర్తించామని చెప్పారు.

మరణించిన మహిళల్లో ఒకరిపై నిందితుల్లో ఒక్కడు గతంలో అత్యాచారం చేసాడని, అత్యాచారం విషయంపై నిందితుడితో కుటుంబానికి తగాదాలున్నాయని, ఈ నేపథ్యంలోనే ఆ ఇంట్లో ఉన్న వాళ్లను హత్య చేశారని అంటున్నారు.

కాల్పులు ఏ ఇంట్లో జరిగాయనేది మాత్రం అధికారులు వెల్లడించడం లేదు. మృతదేహాలు పలు నివాసాల్లో పడి ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+