ప్రియురాలి కోసం అమ్మాయిలా..: దొరికిపోయాడు

కజకిస్థాన్: తన ప్రియురాలు కోసం ఓ ప్రియుడు ఏకంగా అమ్మాయిలా తయారయ్యాడు. తన 17ఏళ్ల ప్రియురాలు ఓ విశ్వవిద్యాలయ పరీక్ష రాసేందుకు తీవ్ర ఆందోళనకు గురవుతుండటంతో అయాన్ జెడెమోవ్(20) అనే యువకుడు అమ్మాయిలా తయారై ఆమె తరపున పరీక్ష రాసేందుకు

వెళ్లాడు. దీన్ని పసిగట్టిన అధికారులు అతడ్ని కటకటాల వెనక్కి నెట్టారు.

మెట్రో కథనం ప్రకారం.. నల్లటి విగ్, తన ప్రియురాలి బ్లౌజ్, స్కర్ట్ ధరించి తన ప్రియురాలి పరీక్ష రాసేందుకు వెళ్లిన అయాన్‌పై.. ఇన్విజిలేటర్లకు అనుమానం వచ్చింది. దీంతో అతడ్ని ప్రశ్నించడం మొదలుపెట్టారు. అయితే అతడి గొంతు అతడ్ని పట్టించింది.

Guy dresses like 17-year-old girlfriend to take her school exams

తన ప్రియురాలి కోసం తాను ఈ పని చేశానని కజకిస్థాన్‌కు చెందిన ఈ యువకుడు ఇన్విజిలేటర్లకు స్పష్టం చేశాడు. కాగా, పరీక్ష రాయాల్సిన అమ్మాయికి బదులు వేరే అమ్మాయి వచ్చి పరీక్ష రాస్తుందనుకున్నాం, కానీ అబ్బాయి అని తాము మొదట గుర్తించలేదని ఇన్విజిలేటర్లు తెలిపారు.

అతడు మాట్లాడే వరకు తాము గుర్తించలేదని చెప్పారు. కాగా, ఈ నేరానికి అయాన్‌కు 2,100 అమెరికన్ డాలర్ల జరిమానా విధించడం జరిగింది. అయితే ఈ ఘటనతో అయాన్ రోమాంటిక్ హీరోగా నిలువగా.. అతని ప్రియురాలు మాత్రం వర్సిటీ టెస్ట్ కోసం మరోసారి సంవత్సరం

వేచివుండాల్సి వచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+