ముగిసిన హెచ్-1బి వీసా కోటా: అమెరికా ఇమ్మిగ్రేషన్ ప్రకటన..
హెచ్1-బి వీసాతో పాటు మాస్టర్ క్యాప్ గా పిలిచే అడ్వాన్స్డ్ డిగ్రీ మినహాయింపు కోటా కింద మరో 20వేల అభ్యర్థుల ఎంపిక కూడా ముగిసిందని ఇమ్మిగ్రేషన్ అధికారులు చెప్పారు.
వాషింగ్టన్: ఏటా విదేశీ ఐటీ నిపుణులకు మంజూరు చేసే హెచ్-1బి వీసా కోటా పరిమితి ముగిసిందని ఫెడరల్ ఏజెన్సీ ప్రకటించింది. మాండేటరీ కోటా కింద స్వీకరించే 65వేల హెచ్-1బి వీసాలకు దరఖాస్తులు అందాయని తెలిపింది. 2018ఆర్థిక సంవత్సరానికి ఈ మాండేటరీ కోటా పూర్తయిందని అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగం ఒక ప్రకటనలో తెలియజేసింది.
హెచ్-1బి వీసాతో పాటు మాస్టర్ క్యాప్ గా పిలిచే అడ్వాన్స్డ్ డిగ్రీ మినహాయింపు కోటా కింద మరో 20వేల అభ్యర్థుల ఎంపిక కూడా ముగిసిందని ఇమ్మిగ్రేషన్ అధికారులు చెప్పారు. కాగా, ఐటీ నిపుణుల కోసం అమెరికా ఏటా 65వేల తాత్కాళిక వీసాలను జారీ చేస్తుంది. ఈ ఏడాది ఏప్రిల్ 1న దీనికోసం ప్రారంభమైన దరఖాస్తుల ప్రక్రియ ఇటీవల ముగిసింది.

అంతకుముందు కంప్యూటర్, లాటరీ పద్దతుల ద్వారా అమెరికా వీసాలను జారీ చేస్తుండేది. ఇప్పుడీ కొత్త పద్దతిలో వీసాలను ఎలా జారీ చేస్తారనే దానిపై ఎటువంటి స్పష్టత లేకపోవడం గమనార్హం.
-
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా -
తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ వరం, ఇక కొత్త రూపు..!! -
Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీ సంపాదన, ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!!












Click it and Unblock the Notifications