వైరల్ వీడియో: హెచ్ 1బీ వీసా షాక్.. విమానం నుంచి బయటకు భారతీయులు పరుగులు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇకపై హెచ్1బీ వీసా కోసం నూతన నిబంధనలను ప్రవేశపెట్టారు. హెచ్1బీ వీసా దరఖాస్తు ఫీజు లక్ష డాలర్‌ లకు(రూ.83 లక్షలు) పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వాషింగ్టన్ డీసీ శ్వేతసౌధంలోని ఓవల్ ఆఫీస్‌ లో శనివారం ఆయన ఈ ఆర్డర్స్‌ పై సంతకం చేశారు. ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా అమెరికాలోని టెక్నాలజీ రంగం, అలాగే అమెరికా హెచ్1బీ వీసాపై ఎక్కువగా ఆధారపడిన భారతీయ ఐటీ, టెక్నాలజీ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.

ట్రంప్ నిర్ణయం భారతీయులను ఒక్కసారిగా షాక్ కు గురిచేసింది. ట్రంప్ నిర్ణయం వెలువడిన వెంటనే పలు విమానాల్లో బోర్డింగ్ కు సిద్ధంగా ఉన్న భారతీయులు విమానం దిగేందుకు పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన పోస్టులు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. అమెరికాలోని శాన్ ఫ్రాన్స్ సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయంలో బోర్డింగ్ కు సిద్ధమైన ఎమిరేట్స్ విమానంలోని భారతీయులు.. ట్రంప్ నిర్ణయంతో పరుగులు తీసుకుంటూ విమానం దిగిపోయారు. భారత్ కు వెళ్తే మళ్లీ అమెరికాకు రానివ్వరన్న భయంతో ఇండియాకు వచ్చేందుకు సిద్ధమైన భారతీయులు విమానం దిగిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

" అమెరికా నుంచి దుర్గా పూజ కోసం భారత్ కు పయనమయ్యారు భారతీయులు. శాన్ ఫ్రాన్స్ సిస్కో అంతర్జాతీయ విమానాశ్రయంలో బోర్డింగ్ పూర్తయింది. విమానం బయల్దేరేందుకు సిద్ధమైంది. ఈ సమయంలోనే హెచ్1బీ వీసా దరఖాస్తు ఫీజు లక్ష డాలర్‌ లకు(రూ.83 లక్షలు) పెంచుతూ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో తమను మళ్లీ అమెరికాకు రానిస్తారో లేదో అన్న భయంతో పదుల సంఖ్యలో భారతీయులు విమానం దిగిపోయారు" అని సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్టు వైరల్ గా మారింది.

H1B Chaos at SFO Indians Flee Plane in Shock at San Francisco Airport

మరోవైపు హెచ్1బీ వీసా దారులు రేపటిలోగా అమెరికాలో ఉండాలన్న రూల్ మేరకు విమానాశ్రయ సంస్థలు టికెట్ రేట్లను భారీగా పెంచేశాయి. దిల్లీ నుంచి న్యూయార్క్ వెళ్లేందుకు ఇప్పటివరకు టికెట్ ధర రూ. 34 నుంచి 37 వేలు ఉంది. ఇప్పుడు ఆ ధర రూ. 70 నుంచి 80 వేలకు చేరింది. ట్రంప్ ప్రకటన వెల్లడైన 2 గంటల్లోనే టికెట్ రేట్లు గణనీయంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దుర్గా పూజ కోసం అమెరికా నుంచి భారత్ కు వచ్చిన హెచ్1బీ వీసా దారులు అమెరికాకు బయల్దేరుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+