'డబుల్'తో ట్రంప్ షాక్: మనోళ్లు ఏ కంపెనీలో ఎంతమంది, వారి మాటేమిటి?
ఉద్యోగం కోసం అమెరికా వెళ్లాలనుకునే వారికి డొనాల్డ్ టంర్ప్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది.
వాషింగ్టన్: ఉద్యోగం కోసం అమెరికా వెళ్లాలనుకునే వారికి డొనాల్డ్ టంర్ప్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. విదేశీ ఉద్యోగుల రాకను కఠినతరం చేసేలా కీలక నిబంధనలతో కూడిన బిల్లును ట్రంప్ ప్రభుత్వం సిద్ధం చేసిన విషయం తెలిసిందే.

గతంలో కంటే డబుల్
అమెరికా వచ్చే ఉద్యోగులు వీసా పొందేందుకు కనీస వేతనం 60వేల డాలర్ల నుంచి 1.30లక్షల డాలర్లకు పెంచారు. 1989 నుంచి 60 వేల డాలర్లుగానే ఉంది. దీనిని ఇప్పటి దాకా మార్చలేదు. కానీ ఇప్పుడు ట్రంప్ అనూహ్యంగా డబుల్ కంటే ఎక్కువ మార్చారు.

స్థానికులకు ఉద్యోగాలు
స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలని బిల్లులో ప్రతిపాదించారు. ట్రంప్ బిల్లు నేపథ్యంలో ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ తదితర సాఫ్టువేర్ కంపెనీల షేర్లు భారీగా పడిపోయాయి.

డిపెండెంట్ వీసాల పరిస్థితి ఏమిటి?
ట్రంప్ ప్రభుత్వం కొత్త ఐటీ సవరణ బిల్లును తెచ్చిన నేపథ్యంలో డిపెండెంట్ వీసాల పైన వచ్చిన వారి పరిస్థితి ఏమిటనే చర్చ సాగుతోంది. మొత్తానికి అమెరికా వలస వెళ్లాలనుకునే వారికి ట్రంప్ షాకిచ్చారని చెప్పవచ్చు.

విదేశీ ఉద్యోగులతో అమెరికా ఐటీ కంపెనీలపై భారం
కొత్త చట్టంతో అమెరికా ఐటీ కంపెనీలకు విదేశీ ఉద్యోగులు భారం కానున్నారు. ఎందుకంటే గతంలో కనీస వేతనం 60వేల డాలర్లుగా ఉంది. ఇప్పుడు రెండింతల కంటే ఎక్కువ పెరిగిన నేపథ్యంలో అమెరికా కంపెనీలకు ఉద్యోగాలు భారం అవుతారు.

ఆందోళనలో ఉద్యోగులు
ట్రంప్ తాజా చట్టం నేపథ్యంలో అమెరికాలో ఇప్పటికే ఉన్న భారతీయుల పైన ఎంతో ప్రభావం పడనుంది. ఇప్పటికే ఉద్యోగులు ఆందోళనలో పడిపోయారు. ముఖ్యంగా దినసరి ఉద్యోగుల పైన ప్రభావం పడనుంది. ప్రస్తుతం ఉద్యోగుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారయింది.

ఏ కంపెనీలో ఎందరు ఉద్యోగులు?
విప్రోలో 12,201, ఇన్ఫోసిస్‌లో 33,289, అవెంచర్‌లో 9,605, డెలాయిట్‌లో 7,606, హెచ్‌సీఎల్‌లో 6,110, ఐగేట్‌లో 4,533, టాటాలో 16,553, టెక్ మహీంద్రాలో 6,041, మైక్రోసాఫ్ట్‌లో 4,575 మంది ఉద్యోగులు ఉన్నారు.
-
అడకత్తెరలో ట్రంప్- ప్రజల ముందుకు -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు..












Click it and Unblock the Notifications