హ్యాకర్లతో పెట్టుకుంటే అంతే: జూకర్‌బర్గ్ సోషల్ మీడియా ఖాతాలు హ్యాకింగ్
న్యూఢిల్లీ: సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ సహా వ్వవస్థాపకుడు, సీఈఓ మార్క్ జూకర్ బర్గ్‌కు హ్యాకర్లు అదిరిపోయే ఝలక్ ఇచ్చారు. సెక్యూరిటీ పరంగా ఫేస్‌బుక్ ఖాతా భద్రమైనప్పటికీ, జూకర్ బర్గ్ సోషల్ మీడియా ఖాతాలపై హ్యాకర్లు దాడి చేశారు. జూకర్ బర్గ్‌కు సంబంధించిన ఇన్‌స్టాగ్రాం, లింక్డ్ ఇన్, పింటరెస్ట్, ట్విట్టర్ ఖాతాలను హ్యాకర్లు ట్యాంపరింగ్ చేయడమే కాకుండా చెడకొట్టారని బెన్ హాల్ అనే హ్యాకర్ తెలిపారు.
అయితే హ్యాకర్లు అయన ఈ మెయిల్ అకౌంట్‌పైకూడా దాడి చేశారా? అనే విషయం మాత్రం తెలియలేదు. జూకర్ బర్గ్ తన సోషల్ మీడియా ఖాతాలన్నింటికీ కూడా వ్యక్తిగత ఈ మెయిల్‌ను లింక్ చేసినట్లుగా తెలుస్తోంది. సౌదీ అరేబియాకు చెందిన హ్యాకర్ల గ్రూపు అవర్ మైన్ ఈ హ్యాకింగ్‌కు పాల్పడినట్టుగా తెలుస్తోంది.

జూకర్ బర్గ్ సెక్యూరిటీ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉందో పరీక్షించేందుకే వారు ఈ హ్యాకింగ్‌కు పాల్పడ్డారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. జూకర్ బర్గ్ అకౌంట్లను హ్యాక్ చేసిన అనంతరం హ్యాకర్లు వాటికి సంబంధించిన స్క్రీన్ షాట్‌లతో పాటు ఆయన లింక్డ్ ఇన్‌కు ఆయన వాడిన 'dadada' పాస్ వర్డ్‌లను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
అయితే ఆ తర్వాత కొద్ది సేపటికే దానిని ట్విట్టర్ నుంచి తొలగించారు. అయితే హ్యాకర్లు పేర్కొన్నట్టుగా జూకర్ బర్గ్ ఇన్‌స్టా గ్రాం ఖాతా తెరుచుకోవడం లేదని ఫేస్‌బుక్ పేర్కొంది. అయితే జూకర్ బర్గ్‌కు చెందిన ఫేస్‌బుక్ ఖాతా మాత్రం సురక్షితంగానే ఉందని ఫేస్‌బుక్ ప్రతినిధి పేర్కొన్నారు.
Ouch. Mark Zuckerberg's social media accounts have been hacked pic.twitter.com/KvVmXOIg5s
— Ben Hall (@Ben_Hall) 5 June 2016












Click it and Unblock the Notifications