షాకింగ్ వీడియో: దావూద్ ఇబ్రహీంను పొగుడుతూ సయిద్ కొడుకు
ముంబై పేలుళ్ల కేసులో నిందితుడు, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు పాకిస్తాన్ ప్రభుత్వం అండదండలున్నాయని మరోసారి రుజువయింది. జమాత్-ఉల్-దవా (జేయూడీ) చీఫ్ మిలిటెంట్ హఫీజ్ సయీద్ కొడుకు తల్హాకి సంబంధించిన
న్యూఢిల్లీ: ముంబై పేలుళ్ల కేసులో నిందితుడు, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు పాకిస్తాన్ ప్రభుత్వం అండదండలున్నాయని మరోసారి రుజువయింది. జమాత్-ఉల్-దవా (జేయూడీ) చీఫ్ మిలిటెంట్ హఫీజ్ సయీద్ కొడుకు తల్హాకి సంబంధించిన వీడియో ఒకటి సంచలంగా మారింది.
ఫిబ్రవరి 5న పాకిస్తాన్‌లో నిర్వహించిన కాశ్మీర్ డే సందర్భంగా జరిగిన ఓ బహిరంగ సభలో తల్హా.. దావూద్ ఇబ్రహీం పేరును ప్రస్తావించినట్టు వెలుగు చూసింది. దావూద్ పేరును ఉపయోగిస్తూ భారత్‌పై యుద్ధం చేయాలని స్థానిక జనాలను రెచ్చగొట్టే నినాదాలు చేయించినట్టు ఆ వీడియోలో కనిపిస్తుంది.

మీరు న్యాయమూర్తుల, పోలీసులు, డాక్టర్లు అవుతారా.. అని తల్హా అడగగా, స్థానికులు అందరూ లేదు అని చెప్పడం వినిపిస్తుంది. మళ్లీ అతను.. మీరంతా దావూద్‌లా అవుదామనుకుంటున్నారా... అని అడగగా, వారు అందరూ అవును అని నినాదాలు చేశారు.
అంతేకాదు, గతేడాది కాశ్మీర్‌లో ఆర్మీ ఎన్‌కౌంటర్‌లో మరణించిన బుర్హాన్ వానీ పేరు కూడా ప్రస్తావించాడు. అతడిలాగా మారతామని వారితో నినాదాలు చేయించాడు. ప్రస్తుతం భారత నిఘా వర్గాలు ఈ వీడియో నిజమైందా కాదా అన్న దానిపై ఆరా తీస్తున్నాయి. డీ కంపెనీ (దావూద్ ముఠా), జేయూడీ కలిసి ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయా అన్న దానిపైనా విచారణ జరుపుతున్నాయి.
-
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!












Click it and Unblock the Notifications