అసాధారణం: అధ్యక్షుడి ఇంట్లోకి చొరబడి కాల్పులు, హైతీ దేశాధినేత హతం, భార్యకూ బుల్లెట్లు
ఉత్తర అమెరికా ఖండంలోని కరీబియన్ దీవుల్లో అత్యధిక జనాభా కలిగిన దేశమైన హైతీలో అసాధారణ రక్తపాత ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండగులు ఏకంగా ఆ దేశాధినేతనే కాల్చి చంపారు. అధ్యక్షుడి అధికార నివాసంలో పట్టపగలు చోటుచేసుకున్న ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. వివరాలివి..

హైతీ అధ్యక్షుడి హత్య
హైతీ అధ్యక్షుడు జొవెనెల్ మోస్(53) బుధవారం నాడు దారుణ హత్యకు గురయ్యారు. దేశ రాజధాని పోర్ట్ ఓ ప్రిన్స్ లోని అధ్యక్షుడి అధికారిక భవనంలో, బుధవారం మధ్యాహ్నం ఈ ఘాతుకం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ప్రెసిడెంట్ జొవెనెల్ భార్య మార్టిన్ మోస్ కు కూడా బుల్లెట్ గాయాలయ్యాయి. దేశాధ్యక్షుడి కాల్చివేతకు సంబంధించిన వార్తను తాత్కాలిక ప్రధానమంత్రి జోసెఫ్ మీడియాకు వెల్లడించారు..

తాత్కాలిక ప్రధాని ప్రకటన..
''దేశ రాజధానిలో ఉన్న అధ్యక్షుడి ఇంటిపై జరిగిన సాయుధ దాడిలో జొవెనెల్ మోస్ చనిపోయారు. ప్రథమ మహిళ మార్టిన్ గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంటకు గుర్తుతెలియని కొందరు సాయుధులు అధ్యక్షుడి అధికారిక నివాసంలోకి చొరబడ్డారు. దేశంలో శాంతిభద్రతలను పరిరక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలెవరూ హైరానా పడొద్దు'' అని తాత్కాలిక ప్రధాని జోసెఫ్ చెప్పారు.
Recommended Video

రాజకీయ విభేధాల వల్లే హత్య?
హైతీ అధ్యక్షుడు జొవెనెల్ మోస్ హత్యపై భిన్న వాదనలు ప్రచారంలో ఉన్నాయి. 2017 ఫిబ్రవరిలో ప్రెసిడెంట్ పగ్గాలు చేపట్టిన ఆయనపై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. మోస్ పదవి నుంచి దిగిపోవాలంటూ దేశవ్యాప్తంగా ప్రజలంతా వ్యతిరేక నిరసన ప్రదర్శనలు చేపట్టారు. నిజానికి ఆయన పదవి కాలం 2021 ఫిబ్రవరిలోనే ముగిసినా, గద్దె దిగడానికి నిరాకరించారు. డిక్రీ ద్వారా జోవెనెల్ ప్రెసిడెంట్ పదవిలో కొనసాగుతున్నారు. ప్రైవేటు అసాసినేషన్ గ్యాంగ్ ద్వారా దగ్గరి వ్యక్తులే ఈ దురాగతానికి పాల్పడి ఉండొచ్చని స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి.
-
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే!











Click it and Unblock the Notifications