హమాస్ అరాచకాలు ఐఎస్‌ను మించిపోయాయి: గాజాకు భారీ సాయం ప్రకటించిన జో బైడెన్
జెరూసలెం: హమాస్ మిలిటెంట్లకు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు పెద్ద తేడా ఏమీ లేదని అన్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. ఇజ్రాయెల్ దేశంలో పర్యటిస్తున్న బైడెన్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. గాజాలో ఆస్పత్రిపై రాక్షసంగా దాడి చేసి 500 మందికిపైగా ప్రాణాలు తీసింది హమాస్ ఉగ్రవాదులేనని అనుమానం వ్యక్తం చేశారు. హమాస్ ఉగ్రవాదుల దాడులతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారన్నారు.
ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న జో బైడెన్.. ఆ దేశ ప్రధాని బెంజిమన్ నెతన్యాహుతో భేటీ అయ్యారు. ఇరువైపుల నుంచి దాడులతో ప్రజలు మరణించడం బాధ కలిగిస్తోందని బైడెన్ వ్యాఖ్యానించారు. గతంలో అమెరికా చేసిన తప్పులను ఇజ్రాయెల్ చేయకూడదని సూచించారు. అమాయక ప్రజల ప్రాణాల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.

కాగా, గాజాలోని ఆస్పత్రిపై హమాస్ ఉగ్రవాదులే దాడులు చేశారని.. తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని ఇజ్రాయెల్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసందే. ఈ దాడులకు సంబంధించి హమాస్ ఉగ్రవాదులు జరిపిన సంభాషణల ఆడియోను విడుదల చేసింది. పలు వీడియోలను కూడా బయటపెట్టింది. అయితే, హమాస్ ఉగ్రవాదులు మాత్రం దాడులకు బాధ్యత వహించడం లేదు. ఆ దాడి తమ పని కాదంటున్నారు.
గాజాగా భారీ సాయం ప్రకటించిన జో బైడెన్
#WATCH | US President Joe Biden arrives in Tel Aviv, Israel amid Israel-Hamas conflict. Israel PM Benjamin Netanyahu and President Isaac Herzog receive him at Ben Gurion Airport.
— ANI (@ANI) October 18, 2023
(Video Source: Reuters) pic.twitter.com/KD7qsp6VGw
ఇరువైపుల నుంచి జరుగుతున్న దాడులతో గాజాలోని వేలాది మంది ప్రజలు నిత్యావసరాలు కూడా దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీరు కూడా దొరక్క గాజా, వెస్ట్ బ్యాంక్‌లో నివసిస్తున్న పాలస్తీనా ప్రజల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ఈ నేపథ్యంలోనే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఈ ప్రాంత ప్రజల కోసం 100 మిలియన్ డాలర్ల మానవతా సాయాన్ని ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు. బెంజిమన్ నెతన్యాహుతో భేటీ అయిన తర్వాత బైడెన్ ఈ ప్రకటన చేశారు.
#WATCH | Israeli PM Benjamin Netanyahu with US President Joe Biden in Tel Aviv, says, "...On Oct 7 Hamas murdered 1400 Israelis in a single day....October 7th, is another day that will live in infamy. Mr President, you rightly said that Hamas is worse than ISIS. The civilised… pic.twitter.com/5EdfPVrDEI
— ANI (@ANI) October 18, 2023
ఇజ్రాయెల్‌కు మద్దతు ప్రకటించిన బైడెన్.. మరోవైపు, మెజార్టీ పాలస్తీనా ప్రజలకు హమాస్ మిలిటెంట్లతో సంబంధం లేదని పేర్కొన్నారు. కాగా, హమాస్ ఉగ్రవాదులు, ఇజ్రాయెల్ దళాలు జరుపుతున్న దాడులతో గాజాలోని లక్షలాది మంది నిరాశ్రయులుగా మారారు. నిత్యావసరాలు లేకుండా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే లక్షల సంఖ్యలో ప్రజలు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు తరలివెళుతున్నారు. ఇరువైపులా దాడులతో ఇప్పటికే అటు ఇజ్రాయెల్, ఇటు గాజాలో వేలాది మంది పౌరులు కూడా మరణించారు.
-
అమెరికాకు షాక్, రష్యా నుంచి 60 మిలియన్ బ్యారెళ్ల చమురు! -
హార్ముజ్ రక్షకుడిని చంపేశాం..! ఇజ్రాయెల్ సంచలన ప్రకటన..! -
ట్రంప్ సీజ్ ఫైర్ కు నో..! మళ్లీ తీవ్రస్థాయికి ఇరాన్ వార్...! -
అమెరికా పరువుతీసిన పాకిస్థాన్.. మంత్రి సంచలన ట్వీట్! -
అమెరికా అలా చేస్తే ట్రంప్ తల తీసుకెళ్తాం: ఇరాన్ సంచలన వార్నింగ్ -
ఇరాన్ క్షిపణి దాడిలో బూడిదైన 'స్టాట్యూ ఆఫ్ లిబర్టీ'.. వీడియో వైరల్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !!












Click it and Unblock the Notifications