ఒసామా బిన్ లాడెన్ కొడుకు పెళ్లి: ఎవరి కూతురుతో తెలుసా?
వాషింగ్టన్: కరుడుగట్టిన ఉగ్రవాది, అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ నాయకుడు ఒసామా బిన్ లాడెన్ తనయుడు హంజా బిన్ లాడెన్ పెళ్లి చేసుకున్నట్లు అతని కుటుంబసభ్యులు ప్రకటించారు. ఈ మేరకు 'ది గార్డియన్' దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

9/11హైజాకర్ కూతురే..
ఈ సందర్భంగా హంజా లాడెన్ గురించి సంచలన విషయాలను లాడెన్ కుటుంబ సభ్యులు వెల్లడించారు. 9/11 దాడులకు నేతృత్వం(లీడ్ హైజాకర్) వహించిన మహ్మద్ అట్టా కుమార్తెను హంజా వివాహం చేసుకున్నట్లు వివరించారు.

ప్రతీకారం వద్దంటూ..
అల్‌ఖైదాలో హంజాకు సీనియర్ స్థానం దక్కిందని, తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకునేందుకు హంజా సన్నద్ధమవుతున్నట్లు వెల్లడించారు. హంజాతో తమకు ప్రత్యక్ష సంబంధాలు ఏవీ లేవని తెలిపిన వారు.. అల్‌ఖైదా ద్వారా ఎలాంటి ప్రతీకార చర్యలకు దిగొద్దని హంజాను కోరారు.

ఆల్‌ఖైదాపై హంజా ఫోకస్
ప్రభాల్యాన్ని కోల్పోయిన అల్‌ఖైదాకు జీవాన్నిపోసేందుకు హంజా యత్నిస్తున్నాడని పాశ్చాత్య ఇంటిలిజెన్స్ ఏజెన్సీలు పేర్కొన్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో అతని ఆచూకీ తెలుసుకునేందుకు ఆయా నిఘా సంస్థలు రెండేళ్లుగా విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. కాగా, హంజా అఫ్గానిస్తాన్‌లో ఉంటున్నట్లు తమకు సమాచారం ఉందని లాడెన్ కుటుంబసభ్యులు తెలిపారు.

గ్లోబల్ టెర్రరిస్టుగా హంజా
బిన్ లాడెన్‌కు సైతం తమతో సంబంధాలు ఉండేవి కాదని, 1999 నుంచి 2011(చనిపోయే వరకూ) మధ్య ఒక్కసారి కూడా లాడెన్ తమను కలవలేదని చెప్పారు. కాగా, గత జనవరిలో అమెరికా.. హంజా బిన్ లాడెన్‌ను గ్లోబల్ టెర్రరిస్టుగా గుర్తించిన విషయం తెలిసిందే. పాకిస్థాన్‌లో తలదాచుకున్న బిన్ లాడెన్‌ను అమెరికా దళాలు 2011లో మట్టుబెట్టాయి.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!











Click it and Unblock the Notifications