బర్త్ డే రోజునే అరెస్ట్, చేతికి బేడీలతోనే లవ్ ప్రపోజల్, వైరల్ గా మారిన వీడియో
అమెరికాలో ఓ ప్రేమికుడు తన బర్త్ డే రోజున, అది కూడా పోలీసులు అరెస్ట్ చేసిన సందర్భంలో వారిని కాస్త సమయం అడిగి మరీ తన ప్రియురాలికి తాపీగా తన లవ్ గురించి ప్రపోజ్ చేశాడు.
వాషింగ్టన్: ప్రేమను వ్యక్తపరచడంలో ఒక్కొక్కరిది ఒక్కో స్టయిల్. లవర్ పుట్టిన రోజున కొందరు, వారికి ఇష్టమైన ప్రదేశంలో మరికొందరు.. ఇలా రకరకాలుగా తమ ప్రేమను వ్యక్తం చేయడం మనం చూస్తుంటాం.
అయితే అమెరికాలో ఓ ప్రేమికుడు తన బర్త్ డే రోజున, అది కూడా పోలీసులు అరెస్ట్ చేసిన సందర్భంలో వారిని కాస్త సమయం అడిగి మరీ తన ప్రియురాలికి తాపీగా తన లవ్ గురించి ప్రపోజ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అమెరికాలోని ఓక్లహామాకు చెందిన బ్రెండన్ థాంప్సన్ మొన్న జూలై 4న అరెస్టయ్యాడు. ఆరోజు.. అమెరికాకు స్వాతంత్ర్య వచ్చిన రోజు. అంతేకాదు, థాంప్సన్ బర్త్ డే కూడా. ఓ కేసులో నిందితుడిగా అనుమానిస్తూ థాంప్సన్ బర్త్ డే రోజునే పోలీసులు అతడిని అరెస్టు చేసేందుకు ఇంటికొచ్చారు.
అతడి చేతులకు బేడీలు వేసిన తరువాత, పోలీసు వాహనం ఎక్కే ముందు థాంప్సన్ పోలీసు అధికారులను రిక్వెస్ట్ చేశాడు. తనకు ఓ అయిదు నిమిషాల సమయం కావాలని, ఇవి తన జీవితంలో చాలా ముఖ్యమైన క్షణాలని అతను అనడంతో పోలీసులు కూడా అంగీకరించారు.
ఆ వెంటనే థాంప్సన్ తన గాళ్ ఫ్రెండ్ లియాండ్రా కీత్ వద్దకు వెళ్లి తన ప్రేమ విషయాన్ని చెప్పాడు. ''నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇక జీవితాంతం నీకు తోడుగా ఉంటా..'' అంటూ అతడు ప్రపోజ్ చేయగా, అతడి ప్రేయసి లియాండ్రా కూడా అందుకు ఓకే చెప్పేసింది.
ఓ వైపు చేతుకలు బేడీలు వేసి ఉన్నా.. మోకాళ్లపై నిలుచుని ప్రియురాలు లియాండ్రాకు థాంప్సన్ చేసిన లవ్ ప్రపోజల్ ఇప్పుడు నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. తన ప్రేయసి వేలికి ఉంగరం తొడిగిన థాంప్సన్.. అక్కడ్నించి కదిలేలోపు లియాండ్రా సాయంతో తాపీగా ఓ సిగరెట్ కూడా కల్చాడు.
ఆపైన ఇంట్లో వాళ్లకు ఏదో చెబుతూ.. సంతోషంగా జైలు బాట పట్టాడు ఆ ప్రేమికుడు. ఈ తతంగం మొత్తాన్ని బాబ్ లించ్ అనే పోలీసు అధికారి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా అది ఇప్పుడు వైరల్ గా మారింది.
-
గెట్ అవుట్: నమ్మకమైన స్నేహితురాలికే ట్రంప్ షాక్. -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
విశాఖపట్నం నుంచి అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం స్పెషల్ ట్రైన్.. హాల్ట్ స్టేషన్లు !! -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీని కదిలిస్తుంది ఈ సినిమా! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పచ్చని చెట్ల మధ్య దాగి ఉన్న తెల్లపామును చూశారా..? -
రైలు బయల్దేరే ముందు ఎక్కే స్టేషన్ మార్పు..! రైల్వే కొత్త రూల్..! -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications