నావద్ద హనుమాన్ విగ్రహం, చూస్తే ఉత్సాహం:ఒబామా

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఎప్పుడూ తన వెంట హనుమాన్ విగ్రహాన్ని ఉంచుకుంటారు. హనుమాన్ విగ్రహాన్ని నిత్యం తన వెంటే ఉంచుకోవడాన్ని ఆయన ఇష్టపడతారు. హనుమాన్ విగ్రహం తనకు అదృష్టం అని ఆయన భావిస్తారు.

నేను ఎప్పుడైనా అలసిపోయినట్టు భావించినా, నన్ను నిరుత్సాహం ఆవరించినా నా జేబులో ఉన్న హనుమంతుడి విగ్రహాన్ని బయటికి తీసి చూసి చూస్తానని, అప్పుడు వెంటనే సరికొత్త ఉత్సాహం, స్ఫూర్తితో ముందుకెళ్తానని ఒబామానే స్వయంగా చెప్పారు.

Hanuman figurine is Obama's lucky charm

అమెరికా ప్రజలను ఉద్దేశించి యూట్యూబ్‌ వ్యవస్థాపకుడు నీల్సన్‌కి శుక్రవారం ఇచ్చిన చివరి ముఖాముఖిలో ఈ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. హనుమాన్‌ విగ్రహంతో పాటు పోప్‌ ఫ్రాన్సిస్‌ నుంచి అందుకున్న ప్రార్థన పూసలు, బౌద్ధ సన్యాసి ఇచ్చిన బుద్ధుడి ప్రతిమ, ఇథియోపియా నుంచి సేకరించిన శిలువ గుర్తు ఎప్పుడూ తన వెంటే ఉంటాయని ఒబామా చెప్పారు.

అయితే నేనేం మూఢనమ్మకాలున్న వ్యక్తిని కాదని, కానీ నిరుత్సాహం, అధైర్యం ఎదురైనపుడు వాటిని ఎదుర్కోవడానికి ఇవి ప్రేరకంగా పని చేస్తాయని, అమెరికా అధ్యక్షుడిగా జనం తనకు అందించిన విశేష అధికారాలతో ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోగలనన్న స్ఫూర్తి తనలో నింపుతాయని ఒబామా చెప్పారు. ఒబామా తన జీవితం తొలినాళ్లలో హిందూమత ప్రభావం ఎక్కువగా ఉన్న ఇండోనేషియాలో గడిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+