viral video:స్ట్రీట్ ఫైట్.. రెండు కుందేళ్లు, పైకి లేచి మరీ గొడవ, ఆ తర్వాత
స్ట్రీట్ ఫైట్.. ఇదీ మనుషులే కాదు జంతువులు.. పెంపుడు జంతువుల మధ్య కూడా జరుగుతుంటాయి. ఇటీవల ఓ రెండు కుందేళ్లు నడి రోడ్డు మీద గొడవ పడ్డాయి. దానికి సంబంధించిన వీడియోను ఒకరు తీసి.. సోషల్ మీడియాలో షేర్చేశారు. ఇంకేముంది ఆ వీడియో తెగ ట్రోల్ అవుతుంది. చాలా మంది కామెంట్స్ చేశారు. ఆ వీడియోను మీరు కూడా చూడండి.
గత శుక్రవారం ఈ వీడియోను ఒకరు షేర్ చేశారు. కారు నుంచి వీడియోను తీశారు. అందులో రెండు కుందేళ్లు తలపడ్డాయి. రెండు నిలబడి మరీ ఫైట్ చేశారు. కొన్ని సెకన్ల తర్వాత వాటికవే వెళ్లిపోయాయి. ఆ రెండు కుందేళ్లు ముచ్చటగా కొట్లాడాయి. ఈ వీడియోను ఇప్పటికే 1.4 మిలియన్ల సార్లు చూశారు. 65 వేల సార్లు లైక్ చేశారు. చాలా మంది రీ ట్విట్ చేశారు. వాటికి కూడా మనుషుల లాగే సమస్యలు ఉండి ఉండొచ్చు అనే కామెంట్స్ వచ్చాయి. అందుకే స్ట్రీట్ ఫైట్‌కు దిగాయని అంటున్నారు.

నడిరోడ్డు మీద మనుషులు గొడవపడటం చూస్తుంటాం.. వాటిని మనం స్ట్రీట్ ఫైట్ అని కూడా చెబుతుంటాం.. కానీ రెండు కుందేళ్లు గొడవ పడ్డాయి. వాటికి కూడా విభేదాలు ఉంటాయని తెలియజేశాయి. కాసేపు గొడవపడ్డాయి. ఒక కుందేలు వెళ్లిన తర్వాత.. మరో కుందేలు వెంబడించింది. దీనికి సంబంధించి నెటిజన్లు కామెంట్స్ ఇలా చేస్తున్నారు. వాటికి కూడా ఇగో ఉంటుందని.. కోపం చూపిస్తాయని అంటున్నారు. అందుకే గొడవను ఇలా రచ్చ చేసి ఉంటాయని అంటున్నారు.
Street fight.. 😅 pic.twitter.com/QiQalPL9mT
— Buitengebieden (@buitengebieden) July 7, 2022












Click it and Unblock the Notifications