హార్వర్డ్ వర్సిటీలో సిబ్బందికి, విద్యార్థులకు మధ్య సెక్స్ బ్యాన్
న్యూయార్క్: అమెరికాలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయాల్లో ఒక్కటైన హార్వర్డ్‌లో విద్యార్థులకు, సిబ్బందికి మధ్య లైంగిక సంబంధాలకు అడ్డుకట్ట పడింది. విద్యార్థులతో లైంగిక సంబంధాలు పెట్టుకోవద్దని ప్రొఫెసర్లకు విశ్వవిద్యాలయం ఆదేశాలు జారీ చేసింది. లైంగిక వేధింపుల విధానంలో భాగంగా ఆ ఆదేశాలు జారీ అయ్యాయి.
ఫ్యాకల్టీ మెంబర్ బోధనా సిబ్బంది అయినా, విద్యార్థులను ప్రశ్నించే పర్యవేక్షకులైనా శృంగార లేదా లైంగిక సంబంధాలు పెట్టుకోవద్దని ఆదేశించినట్లు విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ ఫ్యాకల్టీ కమిటీ చెప్పింది. లైంగిక దుష్ప్రవర్తన విధానంపై సమీక్షలో భాగంగా దాన్ని గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థలకు వర్తింపజేస్తున్టన్లు తెలిపింది.

అమెరికాలోని విశ్వవిద్యాలయాల ఆవరణల్లో లైంగిక వేధింపులు పెరుగుతున్నాయనే ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఆ చర్యలు తీసుకుంది. లైంగిక దాడులు, వేధింపులకు సంబంధించిన ఫిర్యాదులను సరిగా పరిష్కరించలేదనే విషయంపై ఫెడరల్ రివ్యూలో 55 కళాశాలలు, విశ్వవిద్యాలయాల జాబితాను గత మేలో అమెరికా విద్యాశాఖ ప్రచురించింది.
అమెరికాలోని మాసచుసెట్స్‌లోని హార్వర్డ్ విశ్వవిద్యాలయం కూడా ఆ జాబితాలో ఉంది. ఈ విశ్వవిద్యాలయానికి చారిత్రక ప్రత్యర్థి అయిన యాలే 2010లో ఫ్యాకల్టీకి, అండర్ గ్రాడ్యుయేట్స్‌కు మధ్య లైంగిక సంబంధాలను నిషేధించింది.












Click it and Unblock the Notifications