వద్దంటుంటే..: బీబీసీ టీవీ యాంకర్‌ను సీక్రెట్‌గా పెళ్లాడిన ఇమ్రాన్‌ఖాన్!
లాహోర్: పాకిస్తాన్ మాజీ క్రికెటర్, రాజకీయ నాయకుడు ఇమ్రాన్ ఖాన్ గప్‌చుప్‌గా బీబీసీ టీవీ యాంకర్‌ను పెళ్లి చేసుకున్నట్లుగా జోరుగా ప్రచారం సాగుతోంది. అయితే, ఈ పెళ్లిని ఇమ్రాన్ ఖాన్ కుటుంబ సభ్యులు వ్యతిరేకించినట్లుగా తెలుస్తోంది.
ఇమ్రాన్ ఖాన్ బీబీసీ టీవీ చానల్లో పని చేసిన టీవీ యాంకర్ రెహామ్ ఖాన్‌ను రహస్యంగా పెళ్లాడాడని పాకిస్తాన్‌లో ప్రచారం సాగుతోంది. రెహామ్ ఖాన్ వయస్సు 41. ఆమెకు ఇదివరకే పెళ్లయింది. ముగ్గురు పిల్లల తల్లి. ఆమె డైవోర్స్ తీసుకుంది. ఇప్పుడు ఆమెను ఇమ్రాన్ పెళ్లాడాడని పుకార్లు వినిపిస్తున్నాయి.

వీరిద్దరి మధ్య సంబంధం ఉందని గత కొన్ని నెలలుగా పుకార్లు ఉన్నాయి. ఇమ్రాన్ ఖాన్ పదేళ్ల క్రితం జెమీమా గోల్డ్‌స్మిత్‌కు విడాకులు ఇచ్చాడు. ఇమ్రాన్ ఖాన్ వయస్సు 62. ఇమ్రాన్ ఖాన్ పెళ్లాడినట్లుగా భావిస్తున్న రెహామ్ ఖాన్ పాకిస్తాన్‌లో న్యూస్ యాంకర్‌గా పని చేసింది.
మొదటి పెళ్లి, బీబీసీలో వాతావరణం చెప్పే యాంకర్‌గా ఉన్న నేపథ్యంలో ఆమె గతంలో బ్రిటన్‌లో ఉందని అంటున్నారు. గత కొన్నేళ్లుగా వారి మధ్య పరిచయం ఉందని, ఇప్పుడు పెళ్లి చేసుకున్నారని వార్తలు వస్తున్నాయి. కాగా, తాను తన ఇంటి పేరును మార్చుకుంటున్నానని ఇమ్రాన్ ఖాన్ మాజీ సతీమణి జెమీమా గోల్డ్ స్మిత్ అక్టోబర్
నెలలో చెప్పారు. ఇమ్రాన్ ఖాన్ మరో యువతిని పెళ్లాడనున్నాడని అందుకే తన సర్ నేమ్‌లోని 'ఖాన్' పేరును తొలగించుకుంటున్నట్లు తెలిపింది.
ఇమ్రాన్ ఇటీవల తాను మరో పెళ్లి చేసుకోబోతున్నట్లు చెప్పాడని, అందుకే తన పేరులోని సర్ నేమ్‌ను మార్చుకోవాలని నిర్ణయించుకున్నానని ఆమె అప్పుడు తెలిపింది. కాగా, వారి పెళ్లి జరిగిందా లేదా అనేది తెలియాలంటే వారి నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ యాంకర్ జావెద్ రబానీ ఈ నెల 27న ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఓ యాంకర్, ఓ రాజకీయ నాయకుడిని ఈ రోజు పెళ్లి చేసుకుందని ట్వీట్ చేశారు. మరోవైపు, ఈ పెళ్లి ఇమ్రాన్ కుటుంబ సభ్యులకు ఏమాత్రం ఇష్టం లేదని కూడా వార్తలు వస్తున్నాయి.
-
రైతు భరోసా నిధుల విడుదల వేళ మరో ట్విస్ట్, కీలక మార్పులు..!! -
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర..












Click it and Unblock the Notifications