‘హసన్ అలీ రా ఏజెంట్, భార్య భారతీయురాలు.. కాబట్టే క్యాచ్ వదిలేశాడు’ - విపరీతంగా ట్రోల్ చేస్తున్న పాకిస్తానీయులు

గురువారం జరిగిన టీ20 వరల్డ్ కప్ రెండో సెమీ ఫైనల్లో పాకిస్తాన్ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది.
177 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా టాప్ బ్యాటర్లు డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్, స్టీవ్ స్మిత్, మాక్స్‌వెల్ అవుటవడంతో మ్యాచ్ దాదాపు పాకిస్తాన్ చేతిలోకి వచ్చేసింది.
కానీ, షాహీన్ అఫ్రిదీ బౌలింగ్‌లో మాథ్యూ వేడ్ 21 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర ఉన్నప్పుడు ఇచ్చిన క్యాచ్‌ను హసన్ అలీ వదిలేశాడు.
హసన్ అలీ ఆ క్యాచ్ డ్రాప్ చేశాక, మాథ్యూ వేడ్ వరసగా మూడు సిక్సర్లు బాదడంతో పాకిస్తాన్‌కు ఈ టోర్నీ నుంచే అవుట్ అయ్యింది.
"క్యాచ్ జారితే మ్యాచ్ చేజారినట్టే" అంటున్న కొందరు ఈ ఓటమికి హసన్ అలీనే కారణం అంటున్నారు. మరికొందరు మాత్రం హసన్ భార్య భారతీయురాలు అనేది కూడా తెరపైకి తెచ్చారు. కానీ చాలా మంది హసన్ అలీకి అండగా కూడా నిలుస్తున్నారు.
- టీ20 వరల్డ్ కప్: వరుసగా మూడు సిక్స్‌లు కొట్టిన మాథ్యూ వేడ్.. పాకిస్తాన్‌ను ఓడించి ఫైనల్ చేరిన ఆస్ట్రేలియా
- ప్రశాంత్ పంచాడ ఎవరు? అఫ్గానిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తెలుగులో ఎందుకు ట్వీట్ చేశాడు
హసన్ అలీ భారత్‌లో ట్విటర్లో 13వ స్థానంలో ట్రెండ్ అవుతుంటే, పాకిస్తాన్‌లో మాత్రం అతడి పేరు ట్విటర్‌లో రెండో స్థానంలో ఉంది.
ఒక వర్గం హసన్ అలీని మ్యాచ్ ఓటమికి దోషిగా చూస్తుంటే, మిగతా వారు మాత్రం అతడికి మద్దతుగా నిలుస్తున్నారు.
సన్నీ అనే ఒక యూజర్ హసన్ అలీ, షాహీన్ అఫ్రిదీ ఇద్దరినీ టార్గెట్ చేశాడు.
https://twitter.com/IamSunnyB14/status/1458911190193618957
వేడ్ క్యాచ్ డ్రాప్ చేసినందుకు వారి అకౌంటులో డ్రింక్స్ బ్రేక్‌కు ముందే డబ్బులు బదిలీ అయ్యాయని అన్నాడు.
https://twitter.com/FrontalWarriors/status/1458869039111950352
కొంతమంది ట్విటర్‌లో హసన్ అలీని 'రా' ఏజెంట్ అని కూడా అనేశారు.
https://twitter.com/BamanDiBari/status/1458882856441171970
అతడి గురించి రకరకాల మీమ్స్ పెట్టారు.
https://twitter.com/iamfareedagha/status/1458903819425914887
"హసన్ అలీ మ్యాచ్‌ను కాదు, వరల్డ్ కప్ చేజార్చాడు" అని ఫరీద్ అనే ఒక యూజర్ ట్వీట్ చేశాడు.
కానీ, విమర్శలు, ట్రోల్స్‌తోపాటూ ఒక పెద్ద వర్గం హసన్ అలీకి మద్దతుగా కూడా నిలిచింది.
https://twitter.com/SajSadiqCricket/status/1458874091478437893
"హసన్ అలీ ఒక అద్భుతమైన క్రికెటర్, మ్యాచ్ విన్నర్, ప్రతి ఒక్కరికీ ఒక చెడ్డ రోజు వస్తుంది. హసన్ అలీని ప్రశంసించాలి" అని సజ్ సాదిక్ అన్నాడు.
https://twitter.com/sabooralii/status/1458876932192415759
"సబూర్ అనే యూజర్ హసన్ అలీ ఫొటోను షేర్ చేస్తూ అతడిని తిట్టే ముందు ఇది గుర్తుతెచ్చుకోండి" అని ట్వీట్ చేశాడు.
https://twitter.com/arhuml92/status/1458854125748301825
"హసన్ అలీ ఈ టీమ్ కోసం అన్నీ చేశాడు. మీ ద్వేషం మీ దగ్గరే ఉంచుకోండి" అని అర్హుమ్ అన్నాడు.
https://twitter.com/AshishJaggi_1/status/1458886369409855489
హసన్ అలీ సున్నీ ముస్లిం అని, అతడి భార్య భారతీయురాలని చెబుతూ కూడా చాలా మంది అతడిని ట్రోల్ చేస్తున్నారని మరో యూజర్ ట్వీట్ చేశాడు.
మరికొందరు హసన్ అలీపై వస్తున్న ఈ విమర్శలను భారత ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ షమీపై వచ్చిన ట్రోల్స్‌తో పోల్చారు.
https://twitter.com/IftikharFirdous/status/1458853405128986624
"హసన్ అలీని క్షమించండి. భారత అభిమానులు మొహమ్మద్ షమీని విమర్శించినట్లు అతడిని కూడా అనకండి. ప్రతి ఒక్కరికీ జీవితంలో చెడ్డ రోజులు ఉంటాయి" అని ఇఫ్తికార్ ఫిరదౌస్ అన్నాడు.
https://twitter.com/RealHa55an/status/1433017180455673856
హసన్ అలీ నేపథ్యం
గుజ్రాన్‌వాలా సమీపంలోని లడేవాలా వడైచ్ గ్రామానికి చెందిన ఫాస్ట్ బౌలర్ హసన్ అలీది చాలా సాధారణ కుటుంబ నేపథ్యం.
హసన్ అలీ ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్ టీమ్‌లో ప్రధాన బౌలర్లలో ఒకరు. అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రముఖ క్రికెటర్‌గా నిలిచాడు.
గల్లీ క్రికెట్ ఆడుతూ పెరిగిన హసన్ అలీ, అండర్-16 టోర్నీతో తన కెరీర్ ప్రారంభించాడు. ఆ తర్వాత లాహోర్ వెళ్లిన అతడు గ్రేడ్ టూ క్రికెట్ ఆడాడు.
ఆ తర్వాత హసన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఆడి అందరినీ ఆకట్టుకున్నాడు.
హసన్ అలీ కెరియర్ అంతర్జాతీయ స్థాయికి వెళ్లడానికి అతడి అన్న అతా ఉర్ రహమాన్ కారణం.
క్రికెట్ అంటే అతడికి ఉన్న ఇష్టాన్ని గుర్తించిన రహమాన్ తమ్ముడిని ప్రోత్సహించాడు.
తను మొదట కబడ్డీ ఆడేవాడినని, కానీ అన్నయ్య తనలో క్రికెట్ అంటే ఉన్న ఇష్టాన్ని సజీవంగా ఉంచాడని, అందుకే తను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానని హసన్ అలీ బీబీసీ ఉర్దూకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.
2017 చాంపియన్స్ ట్రోఫీలో హసన్ అలీకి బెస్ట్ క్రికెటర్‌గా నిలిచాడు. అతడికి ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ కూడా లభించింది.
- షాహీన్ అఫ్రిది: షాహిద్ అఫ్రిదీ 10 నంబర్ జెర్సీతో ఈ యువ బౌలర్‌కు ఉన్న లింకేంటి?
- IndvsPak టీ20 వరల్డ్ కప్: భారత్‌పై పాకిస్తాన్ గెలవడానికి 10 కారణాలివే...
హసన్ అలీ భార్య భారతీయురాలు
హసన్ అలీ భార్య షామియా అర్జూ భారతీయురాలు. ఇద్దరికీ 2020లో దుబయిలో పెళ్లైంది.
ద హిందూలో ప్రచురించిన ఒక వార్తలోని వివరాల ప్రకారం హసన్ అలీ భార్య షామియా హరియాణాకు చెందినవారు. ఆమె ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్‌లో ఫ్లైట్ ఇంజనీర్. ఆమె కుటుంబం ప్రస్తుతం న్యూ దిల్లీలో ఉంటోంది.
హసన్ అలీ భారతీయ మహిళలను పెళ్లాడిన నాలుగో పాకిస్తాన్ క్రికెటర్ అయ్యాడు. అతడి కంటే ముందు జహీర్ అబ్బాస్, మొహసిన్ ఖాన్, షోయబ్ మాలిక్ కూడా భారత యువతులను పెళ్లాడారు.
- జిమ్మీ నీషామ్: ఒకప్పుడు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాలనుకున్నాడు కానీ, ఇప్పుడు న్యూజీలాండ్‌కు విజయాన్ని తెచ్చిపెట్టాడు
- టీమిండియా టీ20 పగ్గాలు రోహిత్ శర్మకే ఎందుకు అప్పగించారు?
షాహీన్ అఫ్రిదీ కూడా ట్రెండింగ్
హసన్ అలీతోపాటూ షాహీన్ అఫ్రిదీ కూడా ట్విటర్‌లో ట్రెండ్ అవుతున్నాడు.
నిజానికి షాహీన్ అఫ్రిదీ వేసిన నిర్ణయాత్మక ఓవర్లోనే వేడ్ వరుసగా మూడు బంతుల్లో మూడు సిక్సర్లు కొట్టాడు. దాంతో మరో ఓవర్ మిగిలుండగానే ఆస్ట్రేలియా విజయం సాధించింది.
కొంతమంది హసన్ అలీ క్యాచ్ డ్రాప్ చేశాడని విమర్శిస్తుంటే, మరికొందరు షాహీన్ ఆ ఓవర్లో మూడు సిక్సర్లు ఇవ్వడం వల్లే మ్యాచ్ చేజారిందని అంటున్నారు.
https://twitter.com/ranzblade45/status/1458875462550122497
"మొత్తానికి షాహీన్ అఫ్రిదీ ఆమీర్ అయ్యాడు. మాథ్యూ వేడ్ మెరుపు ఇన్నింగ్స్‌కు థాంక్స్. అది అఫ్రిదీ ఓవర్ కాన్ఫిడెన్స్‌ను దించేసింది" అని ఒక ట్విటర్ యూజర్ అన్నాడు.
"హసన్ అలీ క్యాచ్ డ్రాప్ చేయడంతో.. తన ఓవర్లో మూడు బంతులకు మూడు సిక్సర్ల విషయం మర్చిపోతారని షాహీన్‌కు తెలుసు" అని షాహీన్ అఫ్రిదీ నవ్వుతున్న ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన మరో యూజర్ అన్నాడు
https://twitter.com/TheRobustRascal/status/1458889482946502656
"భారత్ ఆటగాళ్లను అవుట్ చేశాక షాహీన్ అఫ్రిదీ వారిని వెక్కిరిస్తూ, అనుకరించాడు. ఈ సిక్సర్లు అతడికి బుద్ధి చెప్పాయి" అని మరికొందరు అన్నారు.
భారత్ మీద పాక్ విజయం ఇస్లాం విజయం అయితే.. ఇప్పుడు జరిగిందేంటి
భారత్ మీద పాకిస్తాన్ విజయం సాధించినపుడు పాకిస్తాన్ మంత్రి షేక్ రషీద్ దానిని ఇస్లాం విజయంగా వర్ణించారు.
పాక్ ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలవడంతో జనం ఇప్పుడు షేక్ రషీద్ పాత ట్వీట్‌ను రీ-ట్వీట్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు.
https://twitter.com/Being_Humor/status/1458857350966636547
"ఈరోజు ఏ మతం ఓడింది" అని ఒక ట్విటర్ యూజర్ షేక్ రషీద్‌ను ట్యాగ్ చేస్తూ అడిగారు.
https://twitter.com/Maverickindiapk/status/1458880240709619712
మరికొందరు "ఈరోజు ఇస్లాం ఓడిపోయిందా?" అని అడుగుతున్నారు.
అయితే షేక్ రషీద్ పాకిస్తాన్ ఓటమి గురించి కూడా ట్వీట్ చేశారు.
https://twitter.com/ShkhRasheed/status/1458858745501470722
"టీమ్ పాకిస్తాన్ మీరు బాగా ఆడారు. మొత్తం టోర్నమెంటులో మీ ప్రదర్శన అసాధారణంగా ఉంది. కానీ ఈ సెమీ ఫైనల్లో.. ఏం ఫర్వాలేదు. గత నాలుగు వారాలుగా మీ అద్భుత ప్రదర్శనతో 220 మిలియన్ల పాకిస్తానీల ముఖాల్లో సంతోషాలు తీసుకొచ్చినందుకు మీకు కృతజ్ఞతలు" అన్నాడు.
- టీ20 ప్రపంచకప్: భారత్ చేసిన 7 తప్పులు
- పాకిస్తాన్, ఆస్ట్రేలియా మ్యాచ్ చూసేందుకు స్డేడియానికి వెళ్లనున్న ఇండియన్ సానియా మీర్జా ఒక్కరేనా? ట్విటర్లో ఏమిటీ చర్చ
పాక్ వరల్డ్ కప్ టోర్నీ నుంచి తప్పుకున్నప్పటికీ ఆ జట్టును ప్రశంసిస్తూ చాలా మంది ప్రముఖులు, రాజకీయ నాయకులు ట్వీట్ చేశారు.
https://twitter.com/ImranKhanPTI/status/1458867003985379332
పాకిస్తాన్ ప్రధాని, ఒకప్పటి ప్రముఖ క్రికెటర్ అయిన ఇమ్రాన్ ఖాన్ జట్టు భావనలను తాను పూర్తిగా అర్థం చేసుకోగలనని ట్వీట్ చేశారు.
https://twitter.com/waqyounis99/status/1458874478704963588
"మీరు ప్రపంచ కప్ గెలవలేకపోయినా, మా మనసులు గెలుచుకున్నారు" అని పాక్ మాజీ ఆటగాడు వకార్ యూనస్ ట్వీట్ చేశాడు.
https://twitter.com/shoaib100mph/status/1458865603029217294
అందరూ టీమ్ ఆటగాళ్లకు అండగా నిలవాలని పాక్ క్రికెట్ టీమ్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ కూడా అపీల్ చేశాడు.
https://twitter.com/Maghizh_ini/status/1458857947774156803
పాక్ ఓటమితో భారత్‌లో ట్విటర్లో #byebyepak కూడా ట్రెండ్ అయ్యింది.
https://twitter.com/TarakRam999/status/1458856140834426881
భారత్ టోర్నీ నుంచి వైదొలిగినప్పుడు పాక్ క్రికెట్ అభిమానులు #byebyeindia అన్నందుకు భారత అభిమానులు ప్రతీకారం తీర్చుకున్నారు.
రకరకాల మీమ్స్‌తో సోషల్ మీడియాను ముంచెత్తారు.
( కాపీ-భూమికా రాయ్)
ఇవి కూడా చదవండి:
- జిన్నా టవర్ సెంటర్: పాకిస్తాన్ జాతిపిత పేరుతో గుంటూరులో స్తూపం ఎందుకుంది?
- తెలంగాణలో వరి సాగు సంక్షోభానికి కారణం ఎవరు? వరి పండగ నుంచి దండగ ఎలా అయ్యింది?
- వాతావరణ మార్పులను అరికట్టడానికి 7 మార్గాలు
- కుప్పం మున్సిపల్ ఎన్నికల పోరు కురుక్షేత్రంలా ఎందుకు మారింది?
- చైనా: చరిత్రాత్మక తీర్మానంతో తన హోదాను సుస్థిరం చేసుకున్న షీ జిన్‌పింగ్
- తిరుమలలో విరిగి పడుతున్న కొండ చరియలు... దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు
- సింగపూర్ డ్రగ్స్ కేసు: షర్మిల సోదరుడిని ఉరిశిక్ష నుంచి తప్పించడం అసాధ్యమా... ఆమె ప్రార్ధనలు ఫలిస్తాయా ?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)
-
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..!












Click it and Unblock the Notifications