Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కాపాడాల్సింది పోయి.. ఆమెపై హస్త ప్రయోగం చేశాడు

పుకెట్ : సరదాగా హాలిడే ట్రిప్ ప్లాన్ చేసుకున్న ఓ అమెరికా యువతికి కళ్ల ముందే హార్రర్ షో చూసినంత పనైంది. సస్పెన్స్ థ్రిల్లర్ తరహాలో.. సాగిన ఆమె థాయిలాండ్ టూర్ ఆమెకు ముచ్చెమటలు పట్టించడమే కాకుండా.. చిత్ర విచిత్ర అనుభవాలను ఎదుర్కొనేలా చేసింది. చివరాఖరికి తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయింది సదరు టూరిస్ట్.

డెయిలీ మెయిల్ కథనం ప్రకారం.. న్యూయార్క్ కు చెందిన హన్నా గేవియోస్ (23) అనే టీచర్ హాలిడే ట్రిప్ కోసం థాయ్ లాండ్ కు వెళ్లింది. ఇదే క్రమంలో ఓ రోజు థాయ్ లాండ్ లో ఉన్న రైలే బీచ్ ను సందర్శించడానికి వెళ్లిన గేవియోస్ అక్కడ దారి తప్పింది. తిరిగి వెళ్లడం ఎలాగో తెలియక సమీపంలోనే ఉన్న ఓ టూరిస్ట్ షాప్ వద్దకు వెళ్లి తన హోటల్ రూమ్ కు వెళ్లడానికి సహాయం కోరింది.

గేవియోస్ అభ్యర్థనతో స్థానికంగా ఉండే ఓ వ్యక్తి ఆమెకు సహాయం చేయడానికి ముందుకు వచ్చాడు. అయితే అతడి ప్రవర్తన పట్ల మాత్రం గేవియోస్ ఎందుకో కాస్త అనుమానం కలిగింది. అయినా సరే చేసేదేం లేదు కాబట్టి.. అతనితో పాటు బయలుదేరింది. అయితే.. సదరు వ్యక్తి మాత్రం ఆమెను పక్కదోవ పట్టించి ఓ అడవి ప్రాంతానికి తీసుకెళ్లాడు.

‘He masturbated on me’: Thai man sexually assaults US woman; arrested

అప్పటికే చాలా దూరం నడవడంతో గేవియోస్ చాలా వరకు అలసిపోయింది. తనకేదో పెను ప్రమాదమే ఎదురవబోతున్నట్లు కూడా ఆమె పసిగట్టింది. నిజానికి తను ఇక చనిపోతానేమో అని కూడా భావించిందట. సదరు వ్యక్తితో పాటు కలిసి నడవడం ఎంత అనుమానంగా తోచిన ఆ సమయంలో మరో మార్గం లేకపోవడంతో.. అలా అతనితో పాటు 16 గంటల పాటు ప్రయాణం చేసింది గేవియోస్.

పదే పదే మనం వెళ్తున్నది సరైన దారేనా అంటూ అతన్ని ప్రశ్నించినా.. అతన్ని అనుసరించడం తప్ప పెద్దగా లాభం లేకుండా పోయింది. అయితే అంత సుదీర్ఘ నడక తర్వాత ఉన్నట్టుండి ఆ వ్యక్తి గేవియోస్ ఒంటి మీద ఉన్న దుస్తులను లాగి పడేయడం కోసం యత్నించాడు. ఈ క్రమంలో గేవియోస్ అతనిపై పిడిగుద్దులు కురిపించడంతో పాటు అతని చెవిని తీవ్రంగా కొరికింది.

నొప్పికి తాళలేక అతడు తీవ్రంగా అభ్యర్థించడంతో.. కొద్దిసేపటి తర్వాత అతనిపై దాడి చేయడం ఆపేసింది గేవియోస్. ఆ తర్వాత కూడా అతని లైంగిక వేధింపులకు ఫుల్ స్టాప్ పడలేదు. అతడు నొప్పితో కింద పడిపోవడంతో.. ఆమె అక్కడినుంచి పరిగెత్తడం మొదలుపెట్టింది. తను ఎక్కడి నుంచి అయితే ఆ వ్యక్తితో కలిసి నడిచి వచ్చి ఉందో తిరగి అదే ప్రాంతానికి చేరుకోవాలన్న ఉద్దేశంతో పరుగు తీయడం మొదలుపెట్టింది.

చుట్టూ దట్టమైన అడవి ఉండడంతో.. తను ఎటువైపు పరిగెడుతున్నానో కూడా తెలియని స్థితిలో ఆమె పరుగు తీసింది. అలా.. చివరికి ఆమె పరుగు ఓ కొండ పైకి దారి తీసి అక్కడి నుంచి కింద పడిపోయింది. కింద పడిపోతున్న కూడా ఏం జరుగుతుందో తెలియని స్థితిలో తాను ఉన్నానని తెలిపింది గేవియోస్.

150 ఫీట్ల ఎత్తునుంచి కింద పడిపోవడంతో.. గేవియోస్ వెన్నెముకకు తీవ్ర గాయాలయ్యాయి. అదీగాక ఓ దట్టమైన పొదల మాటున ఆమె పడిపోవడంతో.. ఎవరూ ఆమెను చూసే అవకాశం లేకుండా పోయింది. ఒంట్లో ఏమాత్రం ఓపిక లేకపోయినా తనను రక్షించాల్సిందిగా ఆర్తనాదాలు చేసింది. ఆమె అరుపుల్ని విన్న 27 ఏళ్ల అపయ్ రుయెన్గ్వేర్న్ అనే వ్యక్తి ఆమె దగ్గరికి వచ్చాడు.

అయితే ఆమెను కాపాడుతాడనుకున్న ఆ వ్యక్తి.. ఆ తర్వాత చేసిన చర్యకు ఆమె తీవ్ర షాక్ కు గురైంది. "గేవియోస్ దగ్గరకు రాగానే తన ప్యాంట్స్ విప్పేసి ఆమెపై హస్త ప్రయోగం చేశాడు అపయ్". అయితే ఆ తర్వాత మరికొంతమందిని వెంటబెట్టుకు వచ్చి ఆమెను ఆసుపత్రిలో చేర్చాడు. అనంతరం పోలీసులు ఆమెను విచారించడంతో.. అపయ్ చేసిన నిర్వాకం విన్న పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.

అపయ్ నిర్వాకానికి అతనికి పలు సంవత్సరాల పాటు జైలు శిక్ష పడే అవకాశముంది. మరోవైపు గేవియోస్ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. ఈ ఉదంతంతో ఆమె ఏమాత్రం ధైర్యం కోల్పోలేదు. అంతేకాదు, ఆసియాలోనే ఉండి వియత్నాంలో తన టీచింగ్ ను కొనసాగించాలనే యోచనలో ఉంది గేవియోస్.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+