విమానంలో పేలిన హెడ్‌ఫోన్స్: కాలిపోయిన యువతి మొహం
ఓ విమానంలో హెడ్‌ఫోన్స్ పేలిపోవడంతో ఓ యువతి మొహం స్వల్పంగా కాలిపోయింది. బీజింగ్ నుంచి మెల్‌బోర్న్ వెళుతున్న విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హెడ్‌ఫోన్స్ పెట్టుకుని నిద్రపోతున్న సమయంలో ఉన్నట్టుండి ఏదో
మెల్బోర్న్: ఓ విమానంలో హెడ్‌ఫోన్స్ పేలిపోవడంతో ఓ యువతి మొహం స్వల్పంగా కాలిపోయింది. బీజింగ్ నుంచి మెల్‌బోర్న్ వెళుతున్న విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హెడ్‌ఫోన్స్ పెట్టుకుని నిద్రపోతున్న సమయంలో ఉన్నట్టుండి ఏదో పేలిన శబ్ధం విని సదరు యువతి ఉలిక్కి పడి లేచింది.
అప్పటికే చెవికున్న హెడ్‌ఫోన్స్ నుంచి మంటలు పొగలు వ్యాపిస్తున్నాయి. మొహము, చేతులు నల్లగా కాలిపోయాయి. హెడ్‌ఫోన్స్ కాలిపోవడం గుర్తించిన యువతి.. వెంటనే వాటిని తీసి పక్కకు పడేసింది. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. లేకపోతే మెడ మొత్తం మొహం కాలిపోయుండేదని బాధిత యువతి భయాందోళన వ్యక్తం చేసింది.

కాగా, ఘటనపై వెంటనే స్పందించిన విమాన సిబ్బంది.. మంటలు వ్యాపించకుండా చర్యలు తీసుకున్నారు. లిథియం బ్యాటరీల కారణంగా విమానంలో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు.
ఇది ఇలావుంటే విమాన సిబ్బంది మాత్రం ఆ హెడ్‌సెట్ ఏ కంపెనీకి చెందినదనే విషయాన్ని గోప్యంగా ఉంచింది. అంతేగాక, సదరు విమాన వివరాలు తెలిపేందుకు కూడా ఇష్టపడలేదు. కాగా, ఇంతకుముందు శాంసంగ్ ఫోన్లు పేలుతుండటంతో వాటిని విమానాల్లోకి తీసుకురావడాన్ని అంతర్జాతీయ ఏవియేషన అధికారులు నిషేధించిన సంగతి తెలిసిందే.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications