ప్లేన్ క్రాష్, ఈజిప్ట్‌కు సెలవ్: తండ్రీకూతుళ్ల చివరి ఫోటో

కైరో: ఈజిప్ట్‌లోని సినాయి ద్వీపకల్పంలో కూలిపోయిన రష్యా విమానానికి సంబంధించి ఓ హృదయవిదారకమైన ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తమ పర్యటన ముగించుకొని విమానం ఎక్కబోయె ముందు ఫోటో దిగిన తండ్రీ, కూతుళ్లు ప్రాణాలు విడిచారు.

ఈ ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్లో అందర్నీ కలచివేస్తోంది. ఈజిప్టు పర్యటన ముగించుకుని ఎంతో సంతోషంగా బయలుదేరిన ఆ తండ్రీకూతుళ్లు విమానం ఎక్కబోయే ముందు ఒక ఫొటో దిగారు. ఆ ఫోటోను రష్యాకు చెందిన ఒక మహిళ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది.

 Heartbreaking photo 'shows father and daughter boarding doomed Russian plane'

దానికి ఓ కాప్షన్ ఇచ్చింది. 'ఈజిప్టుకు ఇక సెలవు... ఇంటికి వెళ్తున్నాము' అంటూ ఒక క్యాప్షన్ కూడా రాసింది. కానీ, ఆ తర్వాత ఆ తండ్రీకూతుళ్లు శాశ్వతంగా ఈ లోకం విడిచి వెళ్లిపోయారు.

శనివారం నాడు ఎయిర్ బస్ 321 విమానం కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ విమానంలోనే రష్యాకు చెందిన లూరీ బయలుదేరాడు. లూరీ విమానం ఎక్కబోయే ముందు తన మూడేళ్ల కూతురు అనస్తాషియా షీన్‌ను ఎత్తుకుని ఫొటో కూడా దిగాడు. ఓల్గా షీన్ అనే రష్యా మహిళ ఆ ఫొటోకు క్యాప్షన్ రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అనంతరం కొన్ని నిమిషాల్లోనే వారు ప్రయాణిస్తున్న విమానం సినాయ్ ప్రాంతంలో కూలింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+