Google Pay: గూగుల్ పేలో భారీగా క్యాష్ బ్యాక్.. ఏకంగా రూ. 87,800 రాక..
యూపీఐ చెల్లింపుల సంస్థ గూగుల్ పే (Google Pay) వినియోగదారులు గత కొన్ని రోజులుగా భారీ మొత్తంలో క్యాష్ బ్యాక్ పొందుతున్నారు. వినియోగదారు $1072 (రూ. 87,800) అందుకున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. అయితే కంపెనీ వెంటనే లోపాన్ని గుర్తించి, క్రెడిట్ చేసిన మొత్తాలను సాధ్యమైన చోట వెనక్కి తీసుకుందని చెబుతున్నారు. గూగుల్ పే లో సాంకేతిక లోపం కారణంగానే ఈ పరిణామం చోటు చేసుకుని ఉండవచ్చని అంటున్నారు.
ముఖ్యంగా డాగ్‌ఫుడింగ్ అనే ఫీచర్ పరీక్షిస్తున్న సమయంలో ఈ పొరబాటు దొర్లినట్టు ప్రాథమికంగా సమాచారం. కంపెనీ కొత్త ఫీచర్ టెస్టింగ్ సందర్భంగా తమ ఉద్యోగులకు చెల్లించే బదులు అనుకోకుండా నగదును కొంతమంది యూజర్లకు పంపించినట్టు తెలుస్తోంది. తమకు భారీగా డబ్బులు వచ్చినట్టు మిషాల్ రెహమాన్ అనే జర్నలిస్ట్ సహా కొంతమంది రెడిట్ యూజర్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.













Click it and Unblock the Notifications