చైనాలో మళ్లీ కోరలు చాచిన వైరస్.. ఏడాదిన్నర క్రితం నాటి సిచుయేషన్
కరోనా వైరస్ ఆవిర్భవించింది చైనా వుహాన్‌లో.. ఆ తర్వాత పరిస్థితులు మెరుగుపడ్డాయి. వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్నట్లు కనిపించింది. కానీ చైనాలో మళ్లీ మహమ్మారి కోరలు చాచింది. ఎంతగా అంటే సరిగ్గా ఏడాదిన్నర క్రితం తొలిసారి కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి పరిస్థితిని గుర్తు చేస్తూ.. డెల్టా వేరియంట్ కేసులు అనూహ్యంగా పెరుగుతున్నాయి. కేసులు అనూహ్యంగా పెరగడంతో ఝాంగ్జియాజీ నగరం మొత్తం కంప్లీట్ లాక్ డౌన్ ప్రకటించారు.
1.5 మిలియన్ల జనాభా ఉన్న ఝాంగ్జియాజీ నగర ప్రజలు ఇళ్లు దాటి బయటకు రావద్దని కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు తాము ఉన్నచోటనే ఆగిపోవాలని హుకుం జారీ చేసింది. కరోనా వ్యాప్తికి స్థానిక అధికారులు, నేతలు బాధ్యులుగా చేస్తూ.. చర్యలకు ఉపక్రమించింది. నగరమంత శానిటేషన్ చేయిస్తూ.. వైరస్ ను నిర్మూలించేందుకు తంటాలు పడుతోంది.
తూర్పు నగరం నాన్జింగ్‌లోని అంతర్జాతీయ ఎయిర్ పోర్టుతో సంబంధాలు ఉన్న మొత్తం 17 ప్రావిన్సులను డెల్టా వేరియంట్ విస్తరించినట్లు గుర్తించింది. జియాంగ్సు ప్రావిన్సులో బయటపడిన కరోనా వేరియంట్ గతంలో అంటే 2019 చివరలో మొదటి కేసులు బయటపడిన వుహాన్ వైరస్‌ను పోలి ఉన్నట్లు గుర్తించారు. అదుపులోకి వచ్చిందని భావించిన కోవిడ్ 19కు ఇప్పుడు ఝాంగ్జియాజీ నగరం హాట్ స్పాట్ లా మారినట్లు గుర్తించారు.

ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.
వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది.
-
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్ -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
ఆ పార్టీ కండువా కప్పుకొన్న టెన్నిస్ దిగ్గజం- రాజకీయాల్లో ఎంట్రీ -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications