ఉరి వదంతే: సియోల్‌లో కిమ్ ‘మిస్టీరియస్’ ప్రియురాలు, నిరసనలు
దావోస్: ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఏం చేసినా సంచలనమే. అతనికి సంబంధించిన ప్రతీ విషయం దాదాపు వివాదాస్పదమే. తాజాగా, కిమ్‌కు మిస్టిరీయిస్ ప్రియురాలుగా ఉన్న హ్యోన్ సాంగ్ వోల్ అనే అమ్మాయి మరోసారి తెరపైకి రావడం సంచలనంగా మారింది.
ఉత్తరకొరియాకు చెందిన అందమైన యువతుల బ్యాండ్ సారథిగా ఆమె చాలా పాపులర్ అయ్యారు. అయితే, కిమ్ జోంగ్ ఉన్ తనతో విభేదాలు రావడంతో ఆమెను ఉరితీయించాడని గతంలో వదంతులు వచ్చాయి.

ఆమె అడగుపెట్టగానే..
కాగా, ఈ నేపథ్యంలో హ్యోన్ సాంగ్ వోల్ ఆదివారం ఒక్కసారిగా శత్రుదేశమైన దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో దర్శనమిచ్చారు. దక్షిణకొరియాలో జరుగుతున్న వింటర్ ఒలింపిక్స్‌లో ఉత్తర కొరియా పాల్గొంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇక్కడ నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు ఆమె సియోల్ వచ్చింది. ఆమెను చూడగానే ఫొటోగ్రాఫర్లు చుట్టుముట్టి తమ కెమెరాల్లో బంధించేశారు. అయితే, ఆమె మాత్రం మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు.
Recommended Video


స్నేహ హస్తం
ఉత్తర కొరియా చేపడుతున్న అణ్వాయుధ పరీక్షల కారణంగా కొరియా దేశాల నడుమ తీవ్ర శత్రుత్వం, ఉద్రిక్తతలు నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దక్షిణ కొరియాతో సంబంధాలు మెరుగుపరుచుకునే ఉద్దేశంతో ఉత్తర కొరియా వింటర్ ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు ఒప్పుకుంది.

పెల్లుబికిన నిరసనలు
మిస్టిరియస్ మహిళగా మారిన హ్యోన్ సాంగ్ వోల్ సియోల్‌లో అడుగుపెట్టగానే నిరసనలు హోరెత్తాయి. ఆమె సియోల్‌కు రాగానే కొందరు నిరసనకారులు కిమ్‌జాంగ్ ఉన్ ఫొటోలను తగులబెట్టి నిరసన తెలిపారు. సోమవారం సియోల్ రైల్వేస్టేషన్ వద్ద ఆమెకు ప్రత్యక్షంగా నిరసన సెగ తగిలింది.

మౌనంగా ఉండిపోయిన సాంగ్..
సాంగ్ వోల్ ఎదురుగానే 150 నుంచి 200 మంది నిరసనకారులు కిమ్ ఫొటోను, ఉత్తర కొరియా జెండాను తగలబెట్టేందుకు ప్రయత్నించారు. ఆమె మౌనంగా చూస్తూ ఉండిపోయారు. కానీ స్పందించలేదు. పోలీసులు రంగప్రవేశం చేసి నిరసనకారుల్ని చెదరగొట్టారు. నిరసనల నేపథ్యంలో అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో భారీగా పోలీసులు మోహరించారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..!












Click it and Unblock the Notifications