లైంగిక జీవితం బాగుండాలంటే ఇలానే ఉండాలి!

లండన్: భార్యాభర్తల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉంటేనే అన్నీ సక్రమంగా సాగుతాయని అమెరికాకు చెందిన మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు. చిన్నచిన్న విషయాలకే నువ్వంటే నువ్వంటూ తెగ వాదులాడుకోవడం తగదని వారు పేర్కొంటున్నారు.. ఈ వాదనలు విడాకులకు దారితీస్తాయే తప్ప మరెందుకు పనికిరావని తేల్చేశారు.

భార్యభర్తలు మధ్య గొడవలు జరుగుతున్న సమయంలో మధ్య వర్తుల ప్రలోభాలకే ఎక్కువ గురవుతుంటారు. ఇంకొందరైతే మాత్రం ఇలా అవకుండా ఉండాల్సిందని అనుకుంటారు. మరికొందరు మాత్రం తాము భార్యభర్తలమే అయినా స్నేహితులుగా ఉంటే ఎంతో బావుంటుంది కదా అనుకుంటారు.

ఇలా స్నేహితులుగా ఉండాలనుకునే వారే తమ దాంపత్యాన్ని సాఫీగా సాగిస్తారని చెబుతున్నారు ఈ సైకాలజిస్టులు. ఏ భార్యాభర్తలైతే స్నేహితులుగా ఉంటారో వారి బంధం చాలా బలంగా ఉంటుందని, లైంగిక జీవితం కూడా అద్భుతంగా ఉంటుందని, సుదీర్ఘకాలం వారి జీవితం హాయిగా గడిచిపోతుందని వీరు చెబుతున్నారు.

Here's Why Couples Should be Friends First

ఇండియానాలోని లారా వాండర్ డ్రిఫ్ట్ యూనివర్సిటీకి చెందిన ఈ నిపుణులు మొత్తం 184మందిని వారు 16 నెలలుగా ఎలా ఉంటున్నారని, వారు అలా ఉండటానికి గల కారణాలు ఏమిటని ప్రశ్నించగా వారంతా స్నేహమే అని బదులిచ్చారు.

స్నేహితులుగా మారిపోతే గడ్డుసమస్యలు కూడా చిన్నవైపోతాయని, అందుకే భార్యభర్తలు ముందు స్నేహితులుగా మారిపోవాలని వారు సూచించారు. కాగా, శాస్త్రవేత్తలు తమ అధ్యయనాన్ని సోషల్ అండ్ పర్సనల్ రిలేషన్‌షిప్స్ జర్నల్‌లో పబ్లిష్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+