'సన్యాసి' ఉద్యోగం ఉంది.. చేస్తారా?

ఫోన్లు, కంప్యూటర్లు, ఇంటర్నెట్.. ఇవేమీ లేకుండా ఒంటరిగా మీరొక్కరే కొన్ని నెలలపాటు ఉండగలరా? అయితే మీలాంటి వారికోసమే ఆస్ట్రియాలో 'సన్యాసి' ఉద్యోగం ఎదురుచూస్తుంది.

ఆస్ట్రియా: ప్రస్తుతం ప్రతి ఒక్కరూ సుఖమైన జీవితానికి, టెక్నాలజీకి అలవాటు పడిపోయారు. ఉదయం లేచింది మొదలు వేడి నీళ్ళ కోసం హీటర్ దగ్గర నుంచి.. పడుకునేటప్పుడు బెడ్ ల్యాంప్ వరకు ఎలక్ట్రానిక్ వస్తువులను విరివిగా వాడేస్తున్నాం.

ఇక ఫోన్లు, కంప్యూటర్లు, ఇంటర్నెట్.. వీటి కారణంగా ఇప్పుడు ప్రపంచం అంతా అరచేతిలోకి వచ్చేసింది. మరి ఇవేమీ లేకుండా మీరు ఉండగలరా? అయితే మీలాంటి వారికోసమే ఆస్ట్రియాలో ఒక ఉద్యోగం ఎదురుచూస్తుంది.

ఓ ఎత్తైన కొండపై ఉన్న ఆశ్రమంలో సన్యాసిగా కొన్ని నెలలపాటు ఒంటరి జీవితం గడపాలి. ఈ ఆశ్రమం ఆస్ట్రియాలోని సాల్ఫెల్దేన్ ప్రాంతంలో సముద్రమట్టానికి 4,600 అడుగుల ఎత్తులో ఉంది. 350 ఏళ్ల క్రితం దీనిని నిర్మించారు.

Hermit wanted to live alone in stunning cliffside hermitage

అప్పట్లో ఈ ఆశ్రమంలో చాలా మంది సన్యాసులు నివాసం ఉండేవారు. ఇంత ఎత్తులో ఉండే ఈ ఆశ్రమంలో తినడానికి కావాల్సిన సదుపాయాలు తప్ప ఇతరత్రా ఎలాంటి సౌకర్యాలు ఉండవు.

అయితే కాలక్రమేణా ఈ ఆశ్రమంలో ఉండే సన్యాసుల సంఖ్య తగ్గిపోయింది. మధ్య యూరప్ ఖండంలో మిగిలిన చిట్టచివరి ఆశ్రమం ఇదే కావడంతో దీనిని పరిరక్షించాలని స్థానిక ప్రభుత్వం సంకల్పించింది. దీంతో ప్రతియేటా ఎవరో ఒకరు ఇష్టపూర్వకంగా ఈ ఆశ్రమంలో ఉండేవారు. కానీ ఈ ఏడాది ఆ ఆశ్రమంలో ఉండడానికి ఎవరూ ముందుకురాలేదట.

దీంతో సన్యాసిగా ఒంటరి జీవితం గడపడానికి ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలంటూ సాల్ఫెల్దేన్ పట్టణ ప్రభుత్వం తమ అధికారిక వెబ్ సైట్ లో ప్రకటన ఇచ్చింది. అయితే దరఖాస్తు చేసుకునేవారికి క్రిస్టియన్ మతంపై నమ్మకం ఉండాలి, వారు శాంతికాముకులై ఉండాలి.

దరఖాస్తును పోస్టులో మాత్రమే పంపించాలి. ఎంపికైన వ్యక్తి ఆ ఆశ్రమంలో ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు ఉంటే చాలు. వామ్మో అన్ని నెలలు అక్కడ ఒంటరిగా ఉండాలా? అనుకోకండి.. ఆ ఆశ్రమం పరిసర ప్రాంతం చాలా ప్రశాంతమైన వాతావరణంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.

ఈ ఆశ్రమాన్ని సందర్శించడానికి అప్పుడప్పుడు పర్యాటకులు వస్తుంటారు. వారితో ప్రార్థనలు చేయించి.. ముచ్చటించవచ్చు. అయితే ఈ ఆశ్రమంలో సన్యాసిగా ఉన్నందుకు ఎలాంటి వేతనం ఇవ్వరు.. ఇందుకు సిద్ధమైతే దరఖాస్తు చేసుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+