లేడీ బాస్ లైంగిక వేధింపులు: మహిళా టెక్కీ ఫిర్యాదు

సన్నీవేల్, కాలిఫోర్నియాల్లో పలు మార్లు ఆమె తనను ఓరల్, డిజిటల్ సెక్స్ కోసం వేధించిందని నాన్ షి ఆరోపించారు. తనతో శృంగారంలో పాల్గొంటే భవిష్యత్తు బాగుంటుందనే లేడీ బాస్ చెప్పేదని ఆమె అన్నారు. ఈ వేధింపులకు తనకు భారీ మొత్తంలో నష్టపరిహారం ఇప్పించాలని ఆమె కోర్టును అభ్యర్థించింది.
అయితే, యాహూ ప్రతినిధి ఆ ఆరోపణలను ఖండించారు. మారియా ఝాంగ్ మీద చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని, ఆరోపణలకు ఆధారాలు లేవని, మారియా కంపెనీలో మంచి ఎగ్జిక్యూటివ్ అని ఆ ప్రతినిధి అన్నారు. ఈ కేసును తాము ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నట్లు తెలిపారు.
మారియా ఝాంగ్ స్థాపించిన సొంత మొబైల్ కంపెనీని యాహూ 2013లో టేకోవర్ చేసింది. అంతకు ముందు ఆమె మైక్రోసాఫ్ట్ జిల్లో కంపెనీలో పనిచేశారు. తనను ఉద్యోగం నుంచి కూడా తీసేశారని నాన్ షీ చెప్పింది.












Click it and Unblock the Notifications