గర్భిణీ అని కూడా చూడకుండా 29సార్లు కత్తితో..
వెల్లింగ్టన్ : గురుప్రీత్ (22) అనే గర్బిణీ స్త్రీని అత్యంత పాశవికంగా హత్య చేసిన ఘటనలో ఆకాశ్ (24) అనే నిందితుడికి జీవిత ఖైదు విధించింది న్యూజిలాండ్ న్యాయస్థానం. వీరిద్దరు 12 నెలల పాటు సహజీవనం చేయగా.. గురుప్రీత్ గర్భం దాల్చింది. ఇదే విషయం ఆకాశ్ తో చెప్పిన గురుప్రీత్.. తన కడుపులో బిడ్డకు ఆకాశ్ తో సంబంధం లేదని చెప్పింది.
ఇకనుంచి తమ మధ్య బంధానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందేనని ఆకాశ్ ను కోరింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న ఆకాశ్ గురుప్రీత్ మాటలు విని తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయాడు. ఇదే క్రమంలో కత్తితో ఆమెను 29సార్లు అత్యంత కర్కశకంగా పొడిచాడు. అనంతరం మృతదేహాన్ని సౌత్ ఆక్లాండ్‌లోని రోడ్డు పక్కన పొదల్లో పడేశాడు.

విషయం పోలీసుల చెవిన పడడంతో విచారణ జరిపిన పోలీసులు ఆకాశ్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే విచారణలోను నిజం ఒప్పుకోని ఆకాశ్.. నాలుగు నెలలకు గానీ అసలు విషయం బయటపెట్టలేదు. విషయాన్ని తీవ్రంగా పరిగణించిన న్యాయస్థానం.. గురుప్రీత్ తో పాటు ఆమె కడుపులోని ప్రాణాన్ని బలితీసుకున్నందుకు ఆకాశ్ కు జీవిత ఖైదు విధిస్తున్నట్లు ఆక్లాండ్ హైకోర్టు జడ్జి మాథ్యూ పామర్ తెలిపారు. దీంతో 17సంవత్సరాల పాటు ఆకాశ్ జైలు శిక్షను అనుభవించనున్నాడు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications