గ్రీన్ కార్డు కోసం వారు 151 ఏళ్లు ఎదురు చూడాలి, పెండింగులో 6 లక్షలకు పైగా
వాషింగ్టన్: అమెరికా వెళ్లాలనుకునే వారికి గ్రీన్ కార్డ్ ఓ కల. శాశ్వతంగా అక్కడ సెటిల్ కావడానికి వీలు కల్పించే చట్టపరమైన వెసులుబాటు. కానీ ఇది లభించడం రోజు రోజుకు కష్టతరమవుతోందట. అడ్వాన్స్‌డ్ డిగ్రీలు కలిగి ఉండి, అద్భుత ప్రతిభా సామర్థ్యాలు, నైపుణ్యం కలిగి ఉన్న భారతీయులు గ్రీన్కార్డ్ లేదా శాశ్వత పౌరసత్వం కోసం 150 సంవత్సరాల పాటు ఎదురు చూడాలట.
ఈ మేరకు కాటో ఇనిస్టిట్యూట్ విశ్లేషణ నివేదికను విడుదల చేసింది. దాదాపు నాలుగు లక్షల మంది భారతీయుల గ్రీన్ కార్డ్ కల నెరవేరాలంటే వారు 151 సంవత్సరాలు వేచి చూస్తేనే లభిస్తుందని తెలిపింది.'

2018 ఏప్రిల్ 20వ తేదీ నాటికి గ్రీన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య 6 లక్షలకు పైగా ఉంది. గ్రీన్ కార్డు మూడు కేటగిరీల్లో ఇస్తారు. అత్యంత నైపుణ్యం కలిగిన వారిని ఈబీ1, మంచి ప్రొఫెషనల్ డిగ్రీ ఉన్న వారిని ఈబీ 2, బ్యాచిలర్ డిగ్రీ ఉన్న వారిని ఈబీ 3 కేటగిరీల కింద చేర్చారు.
కాటో లెక్క ప్రకారం.. ఈబీ 1 కింద 34 వేలకు పైగా భారతీయుల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. భార్యా, పిల్లలను కలుపుకుంటే మరో 48వేలకు పైగా ఉంటాయి. ఇవన్నీ 85వేలకు పైగా ఉన్నాయి. వీరికి అందరికంటే వేగంగా ఆరేళ్లలో గ్రీన్ కార్డు లభించే అవకాశముంది.
ఈబీ 3 కేటగిరీ వారు 17 సంవత్సరాలు వేచి చూడాల్సి వస్తుంది. ఈ కేటగిరీ కింద ఉన్నారు, వీరి భార్యాపిల్లలను కలుపుకుంటే లక్షా పదిహేను వేలకు పైగా ఉన్నారు. ఈబీ2 కేటగిరీ కింద ఉన్న వారు మాత్రం గ్రీన్ కార్డు కోసం 151 సంవత్సరాలు వేచి చూడాలట. వీటి కింద దరఖాస్తు చేసుకున్న వారు రెండు లక్షలకు పైగా ఉండగా, భార్యా పిల్లలను కలుపుకుంటే నాలుగు లక్షల 33 వేలకు పైగా ఉన్నారు. ఇప్పుడు ఉన్న చట్టాలు మార్చకుంటే లక్షలాది మంది విదేశీయులు అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిగా ముద్రపడతారని కూడా కాటో ఇనిస్టిట్యూట్ హెచ్చరించింది.
-
అమెరికా ప్రయోగించిన అందమైన అస్త్రం: ఒక్క మీటింగ్‌తో గ్లోబల్ స్టార్‌గా..! -
చియా సీడ్స్ తీసుకుంటున్నారా - అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
అమెరికా సైన్యాన్ని హార్మూజ్ సుడిగుండాల్లో కప్పెట్టేస్తాం: ఇరాన్ సంచలన వార్నింగ్ -
హార్దిక్ అవుట్ తో కృనాల్ వైల్డ్ సెలబ్రేషన్స్- ఆ వివాదమే అసలు కారణమా..!? -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు












Click it and Unblock the Notifications