ఐఎస్ఐఎస్ స్థాపించింది హిల్లరీ క్లింటన్: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున బరిలో ఉన్నడోనాల్డ్ ట్రంప్ మరో సారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రత్యర్థి అయిన డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్)ను స్థాపించింది హిల్లరీ క్లింటన్ అని ఆరోపించారు. ఐఎస్ఐఎస్ వ్యవస్థాపకురాలైన హిల్లరీ క్లింటన్ కు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదల నుంచి అవార్డు రావాలని చెప్పారు.
ఫ్లోరిడాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో డోనాల్డ్ ట్రంప్ ప్రసంగించారు. ఈ సందర్బంలో హిల్లరీ మీద తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. తాను అమెరికా అధ్యక్షుడిగా ఉండి ఉంటే 9/11 దాడి జరిగేది కాదని ట్రంప్ చెప్పారు.

ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా ఉగ్రవాదులు ఈ స్థాయికి రావడానికి మనకే కారణం అని ట్రంప్ అన్నారు. హిల్లరీ క్లింటన్ చేతిలో ఓడిపోవడం దారుణంగా ఉంటుందని, అది మాత్రం జరిగే పనికాదని, తానే గెలుస్తానని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.
రిపబ్లికన్ పార్టీలో విభేదాలు ఉన్నాయనే కథనాలను డోనాల్డ్ ట్రంప్ ఖండించారు. రిపబ్లికన్ పార్టీ మొత్తం సమైక్యంగా ఉందని, ఎలాంటి అభిప్రాయ విభేదాలు లేవని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు రిపబ్లికన్ పార్టీ సభ్యులు అందరు కలిసి తనను గెలిపిస్తారని డోనాల్ ట్రంప్ జోస్యం చెప్పారు.












Click it and Unblock the Notifications