హిల్లరీ క్లింటన్ ఫస్ట్, ట్రంప్ లాస్ట్: జాతీయ సర్వేలు
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా మారాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ దూసుకుపోతున్నారని, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ వెనుకబడిపోయారని తాజాగా ఓ సర్వే వెల్లడించింది.
ఇటీవల అమెరికాలోని మెక్ క్లత్చీ - మారిఫ్ట్ సంస్థ నిర్వహించిన జాతీయ సర్వేలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూశాయి. డొనాల్డ్ ట్రంప్ కంటే హిల్లరీ క్లింటన్ 15 శాతం అధికంగా ఓట్లు సాధించే అవకాశం ఉందని సర్వే తెలిపింది.

హిల్లరీ క్లింటన్ కు 48 శాతం ఓట్లు, డొనాల్డ్ ట్రంప్ కు 33 శాతం ఓట్లు వచ్చే అవకాశముందని ఆ సర్వే వెల్లడించింది. న్యూయార్క్ లోని మారిస్ట్ ఇన్స్ స్టిట్యూట్ ఫర్ పబ్లిక్ ఒపీనియన్ గత నెలలో ఓ సర్వే నిర్వహించింది.
ఆ సర్వేలో హిల్లరీ క్లింటన్ కు 42 శాతం, ట్రంప్ కు 39 శాతం ఓట్లు వస్తాయని వెలుగు చూసింది. ట్రంప్ కంటే హిల్లరీ క్లింటన్ 9 శాతం అధికంగా ఓట్లు పొందుతారని వాల్ స్ట్రీట్ జర్నల్/ఎన్సీసీ న్యూస్ సర్వే వెల్లడించింది.
ఇప్పటికే పలు జాతీయ సంస్థలు సర్వేలు నిర్వహించి వాటి వివరాలు వెల్లడించారు. అన్ని సర్వేలలో హిల్లరీ క్లింటన్ ముందజలో ఉన్నారు. ట్రంప్ కంటే హిల్లరీ క్లింటన్ 6.8 శాతం పాయిట్లతో ఆధిక్యంలో ఉన్నారని మరో రియల్ క్లియర్ పాలిటిక్స్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో వెలుగు చూసింది.












Click it and Unblock the Notifications