Chinmoy Krishna Das:చిన్మయ్ దాస్‌కు ఆ ఆధ్యాత్మిక సంస్థ మద్దతు..బంగ్లా ప్రభుత్వంపై ఆగ్రహం..!!

Chinmoy Krishna Das Arrest:బంగ్లాదేశ్‌లో అరెస్టయిన హిందూ ఆధ్యాత్మిక గురువు చిన్మయ్ కృష్ణ దాస్‌కు ఇస్కాన్ నుంచి సరైన మద్దతు లభించడంలేదనే ఆరోపణలను ఇస్కాన్ ఖండించింది. చిన్మయ్ కృష్ణ దాస్‌కు ఇస్కాన్ నుంచి సంపూర్ణ మద్దతు ఉందని క్లారిటీ ఇచ్చింది.అంతేకాదు బంగ్లాదేశ్‌లో హిందువుల హక్కులకు భంగం వాటిల్లేలా అక్కడి ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడింది. అక్కడి హిందూ ఆలయాలపై దాడులు, విధ్వంసాలను ఇస్కాన్ ఖండించింది.

చిన్మయ్ కృష్ణదాస్‌కు ఆధ్యాత్మిక సంస్థ ఇస్కాన్ నుంచి మద్దతు లేదని బంగ్లాదేశ్ మీడియా కథనాలు ప్రసారం చేయడంతో ఇస్కాన్ పై విధంగా స్పష్టత ఇచ్చింది.నవంబర్ 25వ తేదీన చిన్మయ్ కృష్ణ దాస్‌ను మొహ్మద్ యూనస్ ప్రభుత్వం అరెస్టు చేసింది. ఆయన విద్వేషపూరితమైన ప్రసంగాలు చేస్తున్నారనే అభియోగం మోపింది.ఈ ఏడాది అక్టోబర్‌ నెలలో చిన్మయ్‌ను ఇస్కాన్ నుంచి తప్పిస్తూ ఆ సంస్థ నిర్ణయించింది.

Hindu Monk s Arrest ISKCON Defends Support for Chinmoy Das

ఇక ఇస్కాన్ నుంచి విడుదలైన ప్రకటన ప్రకారం తాము అన్ని సనాతన ధర్మం సంస్థలతో కలిసి పనిచేస్తామని స్పష్టం చేస్తూనే హిందువుల రక్షణ కోసం పోరాటం చేస్తామని క్లారిటీ ఇచ్చింది. అదే సమయంలో బంగ్లాదేశ్‌లో మైనార్టీలుగా ఉన్న హిందూ సమాజం ఒక శాంతియుత వాతావరణంలో జీవనం సాగించేందుకు చర్యలు తీసుకుని తమవంతు కృషి చేస్తామని పేర్కొంది. ఇదే విషయాన్ని పలుమార్లు మీడియా సమావేశాల ద్వారా తెలిపినట్లు ఇస్కాన్ సంస్థ గుర్తు చేసింది.గతంలో చిన్మయ్ గురించి తమ సంస్థ చేసిన వ్యాఖ్యలు భారత్ వరకే పరిమితం అవుతాయి తప్ప, బంగ్లాదేశ్‌లోని ఇస్కాన్‌కు చిన్మయ్‌కు అధికారికంగా ఎలాంటి సంబంధం లేదని మాత్రమే చెప్పామని గుర్తుచేసింది.

చిన్మయ్ కృష్ణదాస్‌కు ఇస్కాన్ నుంచి సంపూర్ణ మద్దతు ఉందని ఆ సంస్థ అధికారిక సోషల్ హ్యాండిల్ ఎక్స్ పై పోస్టు చేసింది. ఇలాంటి భక్తులందరిని శ్రీకృష్ణ భగవానుడు కాపాడాలని తాము ప్రార్థిస్తున్నట్ల పేర్కొంది. ఇదిలా ఉంటే చిన్మయ్ కృష్ణ దాస్ అరెస్టు తర్వాత చెలరేగిన హింసాత్మక ఘటనల వెనుక ఇస్కాన్ బంగ్లాదేశ్ ఉందనే వార్తలను ఖండిస్తూ మరో పోస్టు పెట్టింది.ఈ హింసాత్మక ఘటనలో ఒక లాయర్ మృతి చెందాడు. ఏవైతే తప్పుడు వార్తలు ప్రచారంలో ఉన్నాయో అవి నిరాధారమైనవంటూ కొట్టిపారేసింది.

ఇస్కాన్ బంగ్లాదేశ్‌ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా నిరాధారమైన తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారంటూ ఇస్కాన్ జనరల్ సెక్రటరీ చారు చంద్రదాస్ బ్రహ్మచారి ఆగ్రహం వ్యక్తం చేశారు.తమ సంస్థను లక్ష్యంగా చేసుకుని సమాజంలో హింసను ప్రేరేపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక చిన్మయ్ దాస్ అరెస్టు తర్వాత ఆయనపై పలు అభియోగాలు వచ్చాయి. చిట్టగాంగ్‌లో ర్యాలీ సందర్భంగా బంగ్లాదేశ్ జాతీయ జెండాను ఆయన అవమానపరిచారనేది ప్రధాన అభియోగం. ఇక చిన్మయ్ అరెస్టు తర్వాత ఆయనకు బెయిల్‌ను కోర్టు తిరస్కరించింది. దీంతో ఆయన జైలులోనే ఉన్నారు.

ఇదంతా జరుగుతున్న సమయంలోనే ఇస్కాన్‌పై నిషేధం విధించాలంటూ పిలుపులు మిన్నంటుతున్నాయి.బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా ఇస్కాన్ సంస్థ ఫండమెంటలిస్టు అనే ముద్ర వేసింది.అయితే ఇస్కాన్‌పై నిషేధం విధించేందుకు అక్కడి హైకోర్టు ఒప్పుకోలేదు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా న్యాయస్థానం ఇందులో జోక్యం చేసుకోలేమని వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+