ఏందీ షారుఖ్ ఇదీ, కాసేపట్లో పెళ్లి అనగా, హిందూ యువతి కిడ్నాప్, మత మార్పిడి చేసి పెళ్లి

పాకిస్థాన్‌లో మెజార్టీ ముస్లింలు ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. సింధు ప్రావిన్స్‌లోని హలాలో మత మార్పిడులు ఎక్కువగా జరుగుతుంటాయి. ఇటీవల ఓ 24 ఏళ్ల హిందూ యువతిని ముస్లిం యువకుడు పోలీసులు, కొందరు రౌడీలతో కలిసి పెళ్లి మండపం నుంచి ఎత్తుకెళ్లాడు. మరికాసేపట్లో పెళ్లి జరుగుతందనగా జరిగిన ఘటన చర్చానీయాంశమైంది.

కాసేపట్లో పెళ్లి అనగా..

కాసేపట్లో పెళ్లి అనగా..

సింధు ఫ్రావిన్స్‌లోని మైత్రి జిల్లాలో మత మార్పిడులు ఎక్కువే. ముఖ్యంగా హిందు యువతీలను మతం మార్చి ముస్లిం యువకులు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఇటీవల భారతీని యువతి పెళ్లి కాసేపట్లో జరగనుంది. ఇందుకోసం మతియారి జిల్లాలో గల హలా అనే చోట తల్లిదండ్రులు ఏర్పాటు చేశారు. అయితే ఇంతలో షారుఖ్ గుల్ అనే వ్యక్తి కొంతమందితోపాటు పోలీసులను తీసుకొచ్చాడు. భారతీను ఎత్తుకెళ్లి మతం మార్చాడు. తర్వాత ముస్లిం సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నాడు.

ఫోటోలు వైరల్

ఫోటోలు వైరల్


మరికాసేపట్లో తమ కూతురు వివాహం జరుగుతుందనగా షారుఖ్ గుల్ ఎత్తుకెళ్లాడని భారతీ తండ్రి కిశోర్ దాస్ పేర్కొన్నారు. తర్వాత భారతీ ఇస్లాం మతంలోకి మారినట్టు ఫోటోలు, ఇస్లాం సాంప్రదాయం ప్రకారం జరిగిన వివాహానికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భారతీ ఇస్లాం మతంలోకి మారిన తేదీ మాత్రం డిసెంబర్ 1, 2019గా ఉంది. అంతకుముందే మత మార్పిడి చేయడం వల్ల భారతీని షారుఖ్ గుల్ ఎత్తుకెళ్లారా అనే అనుమానం వ్యక్తమవుతోంది. అందులో భారతి పేరు బుస్రాగా మార్చినట్టు సర్టిఫికెట్‌లో ఉంది. సర్టిఫికెట్‌ను ముఫ్లి అబూబకర్ సయ్యద్ ఉర్ రహ్మన్‌గా అందజేశారు.

రెండో అడ్రస్ ఇదే..

రెండో అడ్రస్ ఇదే..

జాతీయ గుర్తింపు కార్డులో మాత్రం భారతి శాశ్వత చిరుమానా హలాగా ఉండగా.. తాత్కాలిక అడ్రస్ మాత్రం కరాచీలోని గుల్షాన్ ఇక్బాల్‌లో ఉంది. ఇదీ షారుఖ్ గుల్‌తో ఉంటోన్న స్వస్థలం అని భావిస్తున్నారు. అయితే షారుఖ్‌ను భారతీ ఎప్పుడు పెళ్లి చేసుకుందనే అంశంపై క్లారిటీ రాలేదు. ఆమె పెళ్లి ధ్రువీకరణ పత్రంలో షారుఖ్.. కూడా హలాకు చెందినవాడు అని ఉంది. నిషార్ అహ్మద్ కుమారుడే షారుఖ్ గుల్ అని స్థానికులు చెప్తున్నారు.

కూతురిని ఇవ్వండి..

కూతురిని ఇవ్వండి..

తమ కూతురుని వెంటనే స్వస్థలానికి పంపించాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. షారుఖ్ తమ కూతురిని కిడ్నాప్ చేశాడని ఆరోపిస్తున్నారు. నెల ముందు భారతిని షారుఖ్ బలవంతంగా మత మార్పిడి చేసి ఉంటాడని బాధితురాలి పేరెంట్స్ చెప్తున్నారు. అయితే షారుఖ్ మాత్రం.. తనకు బుస్రాకు ఇదివరకే పెళ్లి అయిపోయిందని చెప్పాడు. తన భార్యకు హిందు యువకుడితో పెళ్లి జరిపించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పెళ్లి జరుపుతుండగా పోలీసులతో సహా వచ్చి మంటపం నుంచి యువతిని ఎత్తుకెళ్లాడు.

హై టెన్షన్

హై టెన్షన్

భారతీని ఎత్తుకెళ్లి.. మతం మార్చి పెళ్లి చేసుకోవడంతో హలాలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇక్కడ హిందువులకు రక్షణ లేదా అని స్థానిక హిందువులు వాపోతున్నారు. దేశంలో మైనార్టీలకు రక్షణ ఇస్తామని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం దీనికి ఏం సమాధానం చెప్తుందని ప్రశ్నిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+