అంచనాల్ని మించి.. హిట్లర్ భార్య 'నిక్కర్'కు ఊహించని ధర

లండన్ : నియంత అనే పదం వినిపించగానే వెంటనే గుర్తొచ్చే పేరు హిట్లర్. ప్రపంచాన్ని తన నియంత పోకడలతో అంతగా వణికించారాయన. తాజాగా ఆయన భార్య ఎవా బ్రాన్ కు సంబంధించిన ఓ నిక్కర్ ను వేలంలో పెట్టగా అనూహ్య రీతిలో భారీ మొత్తం పలికింది.

తొలుత బ్రాన్ నిక్కరుకు 400 పౌండ్ల ధర పలుకుతుందని అంచనా వేసినప్పటికీ.. అంచనాలను దాటిపోతూ ఏకంగా ఏడు రెట్ల అధిక మొత్తానికి బ్రాన్ నిక్కర్ అమ్ముడుపోయింది. రూ.2900 పౌండ్ల ధరను వెచ్చించి బ్రిటన్‌కు చెందిన ఓ ప్రైవేటు సేకరణ కర్త నిక్కర్ ను సొంతం చేసుకున్నారు. ఇక నిక్కర్ విషయానికొస్తే.. లేస్, రిబ్బన్ ట్రిమ్ తరహా డిజైన్ తో చేసిన ఈ నిక్కర్ పై 'ఈబీ'(ఎవా బ్రాన్) అని పేరు రాసి ఉండడం గమనార్హం.

Hitler's wife's knickers sold at auction

నిక్కర్ తో పాటు బ్రాన్ కు సంబంధించిన ఉంగరాన్ని, సిల్వర్ లిప్ స్టిక్ ను కూడా వేలంలో పెట్టారు. దీంతో బ్రాన్ బంగారు ఉంగరం 1,250 పౌండ్ల ధర పలకగా.. సిల్వర్ లిప్‌స్టిక్ కేస్ 360 పౌండ్ల ధర పలికింది. వేలం నిర్వాహకుడైన అక్షనీర్ ఫిలిప్ సెరెల్ దీనిపై స్పందిస్తూ.. చరిత్రపై ప్రజల్లో సహజంగా ఉండే మక్కువ కారణంగానే వీటికి అధిక ధర పలికినట్టుగా పేర్కొన్నారు. ఇదే వేలంలో హిట్లర్-ఎవా బ్రాన్ ల బ్లాక్ అండ్ వైట్ ఫోటోలను కూడా వేలంలో పెట్టగా.. వంద పౌండ్లకు అమ్ముడుపోయినట్టు సమాచారం. ఈ విషయాలన్ని బీబీసీ ద్వారా వెల్లడయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+