HMPV! చైనాలో మరో కొత్త వైరస్ కలకలం
చైనాలో మరో కొత్త వైరస్ కలకలం రేపుతోంది. ప్రపంచాన్ని వణించిన కరోనావైరస్ మహమ్మారికి పుట్టినల్లయిన చైనా.. ఇప్పుడు మరో మహమ్మారిని సృష్టించినట్లు తెలుస్తోంది. చైనాలో కొత్తగా హ్యూమన్ మెటానిమోవైరస్ (HMPV) అనే వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ వైరస్‌కు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చైనాలో హెచ్ఎంపీవీ వైరస్ బారినపడి పెద్ద సంఖ్యలో ఆస్పత్రుల్లో చేరుతున్నట్లు సమాచారం. హెచ్ఎంపీవీ వైరస్ తోపాటు ఇన్‌ఫ్ల్యూయెంజా ఏ, మైక్రోప్లాస్మా, నిమోనియా, కోవిడ్-19 వైరస్‌లు తీవ్రంగా వ్యాప్తి చెందుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా పలువురు పోస్టులు పెడుతున్నారు.

అంతేగాక, చైనా దేశంలోని పలు ప్రాంతాల్లో ఈ కొత్త వైరస్ కారణంగా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే, చైనా దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయడం లేదు. కాగా, కొత్త వైరస్ సోకినవారిలో కూడా కోవిడ్ తరహా లక్షణాలే కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. వైరస్ వ్యాప్తిని అక్కడి వైద్య నిపుణులు నిశితంగా పరిశీలిస్తున్నారు.
ఇది ఇలావుండగా, ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ గురువారం విడుదల చేసిన నివేదిక ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తోంది. గుర్తు తెలియని ఓ నిమోనియా తరహా వైరస్ మూలాలను కనుగొనేందుకు చైనా వ్యాధి నియంత్రణ అథారిటీ ఓ పర్యవేక్షణ వ్యవస్థను ప్రారంభించిందని ఆ నివేదిక సారాంశం కావడం గమనార్హం.
కాగా, దాదాపు ఐదేళ్ల క్రితం ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి ఎంత విధ్వంసాన్ని సృష్టించిందో అందరికీ తెలిసిన విషయమే. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రాణాలు కోల్పోగా... వంద కోట్లకుపైగా ప్రజలు కరోనా బారినపడి ఇప్పటికీ కొందరు దాని బాధితులుగానే ఉన్నారు ఈ నేపథ్యంలో చైనా ఈ కొత్త వైరస్ వ్యాప్తి అరికట్టేందుకు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. వైరస్ కారకాలను గుర్తించేందుకు, నిరంతరం అధికార యంత్రాంగానికి అవసరమైన సూచనలు చేసేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు చైనా అధికారిక మీడియా సీసీటీవీ వెల్లడించింది.












Click it and Unblock the Notifications