సెక్స్ ఎడ్యుకేషన్: పిల్లలకు ఇలా బోధిస్తారా?, తల్లిదండ్రుల అభ్యంతరం..

విద్యార్థులకు సెక్స్ ఎడ్యుకేషన్ అవసరమే గానీ ఈ తరహాలో కాదని అంటున్నారు. పుస్తకాల్లోని విషయాలు చూడటానికే సిగ్గేస్తుందని ఓ విద్యార్థి తల్లి సోషల్ మీడియాలో వాపోవడం గమనార్హం.

బీజింగ్: సెక్స్ ఎడ్యుకేషన్ ను నిర్లక్ష్యం చేయడంపై చాలాకాలంగా చైనా ప్రభుత్వం మీద విమర్శలున్నాయి. ఇటీవలి కాలంలో ఆ విమర్శలకు చెక్ పెట్టేందుకు స్కూల్లో ప్రాథమిక స్థాయిలోనే సెక్స్ ఎడ్యుకేషన్ ను ప్రవేశపెట్టింది.

బీజింగ్ నార్మల్ యూనివర్సిటీ ఈ సెక్స్ ఎడ్యుకేషన్ పుస్తకాలను ముద్రించింది. బీజింగ్ లోని ఎలిమెంటరీ స్థాయి విద్యలో 6 నుంచి 13ఏళ్ల మధ్య వయసు గల విద్యార్థులకు ఈ పుస్తకాలతో సెక్స్ ఎడ్యుకేషన్ ను బోధిస్తున్నారు.

Honest primary school sex education textbook in China slammed for going too far

అయితే ఇందులో ముద్రించిన గ్రాఫిక్స్ కాస్త వివాదస్పదంగా ఉండటంతో వీటిపై చర్చ మొదలైంది. పిల్లలు సైతం ఇంటికెళ్లాక తల్లిదండ్రులను వీటి గురించి అడగడంతో ఏం చెప్పాలో తెలియక వారు సతమతమవుతున్నారు. దీంతో సెక్స్ ఎడ్యుకేషన్ పేరిట ముద్రించిన పుస్తకాలు పిల్లలను చెడగొట్టేవిగా ఉన్నాయని తల్లిదండ్రులు వాపోతున్నారు.

విద్యార్థులకు సెక్స్ ఎడ్యుకేషన్ అవసరమే గానీ ఈ తరహాలో కాదని అంటున్నారు. పుస్తకాల్లోని విషయాలు చూడటానికే సిగ్గేస్తుందని ఓ విద్యార్థి తల్లి సోషల్ మీడియాలో వాపోవడం గమనార్హం. తల్లిదండ్రులపై అభ్యంతరాలపై స్పందించిన బీజింగ్ నార్మల్ యూనివర్సిటీ మాత్రం.. పాఠ్యపుస్తకాలను పలు దశల్లో పరిశీలించి, తల్లిదండ్రులతో చర్చించాకే సెక్స్ ఎడ్యుకేషన్ పుస్తకాలు రూపొందించినట్లు చెబుతోంది.

తల్లిదండ్రుల నుంచి దీనిపై అభ్యంతరాలు వెలువడుతున్న తరుణంలో.. మరికొంతమంది నెటిజెన్స్ మాత్రం దీన్ని సపోర్ట్ చేస్తుండటం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+